నిజామాబాద్ : తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం గత 36రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పంచాయతీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నిజమాబాద్లో పంచాయతీ కార్మికులు మాట్లాడుతూ... తాము దుర్భర జీవితం అనుభవిస్తున్నామని... తమకు న్యాయం చేయాలని వారు కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గత 36 రోజులుగా తాము ఆందోళన చేస్తున్నా పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ కనీసం పట్టించుకో లేదనే ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను కార్మికులు దహనం చేశారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని పంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు.