
యాదాద్రి : వరంగల్ నుంచి హైదరాబాద్ వెళుతున్న పుష్‌పుల్ ప్యాసింజర్ రైలు బుధవారం ఉదయం సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయింది. భువనగిరి-రాయగిరి మధ్య రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విధులకు వెళ్లేందుకు ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఆందోళన వ‍్యక్తం చేశారు. రైలు ఎప్పుడు కదులుతుందనే దానిపై సమాచారం తెలియకపోవడంతో ప్రయాణికులు ఎదురు చూపులు చూస్తున్నారు.