ఫీజు రీఇంబర్స్ మెంట్ పై కరీంనగర్ జిల్లా జమ్మికుంట గ్రామంలో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో శనివారం ఉదయం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.ఫీజు రీఇంబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని, స్కాలర్ షిప్ బకాయిలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.