
డాక్టర్ దంపతులకు స్వాగతం పలుకుతున్న ద్వారకానర్ కాలనీ వాసులు
గోల్కొండ: నీలోఫర్ ఆస్పత్రిలో కరోనా సోకిన చిన్నారులకు 45 రోజుల పాటు చికిత్స చేసి మంగళవారం ఇంటికి వచ్చిన డాక్టర్ దంపతులు డాక్టర్ మామిడి అఖిలేష్, డాక్టర్ మౌనికలకు మంగళవారం షేక్‌పేట్ ద్వారక నగర్‌లోని స్థానికులు వారి సేవలను కొనియాడుతూ.. వారిపై పూల పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. జూబ్లీహిల్స్ మాజీ కార్పొరేటర్ మామిడి లక్ష్మీ నర్సింగ్‌రావు కొడుకు కోడళ్లయిన ఈ యువ దంపతులు వృత్తినే దైవంగా భావిస్తూ చిన్నారులకు సేవలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ దంపతులు మాట్లాడుతూ... స్థానికులు తమకు స్వాగతం పలికిన తీరు తమకెంతో ఆనందాన్ని ఇవ్వడంతో పాటు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment