మేయర్ పదవిపై హైకోర్టులో పిటిషన్
Published Mon, Mar 20 2017 6:43 PM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM
హైదరాబాద్: కాకినాడ మేయర్ పదవిని నిబంధనలకు విరుద్ధంగా జనరల్‌కు కేటాయించారంటూ దాఖలైన పిటిషన్ హైకోర్టులో సోమవారం విచారణకు వచ్చింది. నిబంధనల మేరకు ఎస్సీ అభ్యర్ధికి కేటాయించాల్సి ఉండగా ప్రభుత్వం పట్టించుకోలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. రొటేషన్ పద్దతిని పాటించకుండా జనరల్ కు కేటాయించారని కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం మూడువారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
Advertisement
Advertisement