రైతు ఆత్మహత్యలపై ఘటన జరిగిన 72 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని మెదక్ జాయింట్ కలెక్టర్ పి. వెంకట్ రాం రెడ్డి అధికారులకు ఆదేశించారు. సోమవారం అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు.
జిల్లాలో ఎక్కడైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే.. దానిపై డివిజన్ స్థాయి కమిటీ విచారణ నివేదికను 72 గంటల్లోగా అందించాలని కోరారు. ఘటన జరిగిన 5గంటల్లోపల అధికారులు సంఘటనా స్థలానికి చేరుకోవాలని సూచించారు. దీని వల్ల బాధిత కుటుంబాలకు వీలైనంత త్వరగా సాయం అందించేందుకు వీలైతుందని చెప్పారు.