
సాక్షి, సరిసిల్ల: చేతులు పని చేయకున్నా ఆమె చెరగని ఆత్మవిశ్వాసానికి ప్రతీక. కాలుతోనే కవిత్వాన్నిరాస్తూ.. శభాష్ అనిపించుకుంటుంది. సిరిసిల్ల సాయినగర్‌కు చెందిన బూర రాజేశ్వరి దివ్యాంగురాలు. ఎన్నికల నేపథ్యంలో రాజేశ్వరి కాలుతో అక్షరాలను లిఖించి.. మంగళవారం ‘సాక్షి’కి పంపించారు.
నోటు మాటున ఓటేయకు..
ప్రజాస్వామ్యాన్ని కాటేయకు..
విక్రమార్కునిలా ఓటు వెయ్యి..
అక్రమార్కుల తాట తియ్యి..
అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు.
ఏ పాటి వాడో చూడు..
ఎన్నుకుంటే వెలగబెట్టడం కాదు..
ఇప్పటి దాక ఏం చేశాడో చూడు..
పెట్టుకొనే టోపి కాదు..
పెట్టిన టోపి చూడు..
Comments
Please login to add a commentAdd a comment