డ్రంకెన్ డ్రైవ్‌లో 18 మందిపై కేసులు నమోదు
శంషాబాద్: నగరంలో చేపట్టిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 18 మందిపై కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జ్లిలా శంషాబాద్ మండలం తొండుపల్లి ఔటర్ రింగురోడ్డు టోల్ గేట్, బెంగళూరు జాతీయ రహదారిపై శనివారం రాత్రి పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు జరిపారు. ఈ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతన్న18 మందిపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎయిర్ పోర్ట్ ట్రాఫిక్ పోలీసులు 5 కార్లు, 2 డీసీఎంలు, 4 ఆటోలు, 7 ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు.