కరీంనగర్‌లో కార్డెన్ సెర్చ్ : 10 బైక్‌లు స్వాధీనం
వీణవంక : కరీంనగర్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
సీపీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో వీణవంక మండలం నర్సింగాపూర్‌లో జరిగిన ఈ నిర్బంధ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 10 బైక్‌లు, 4 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. రూ. 20 వేలు విలువ చేసే గుట్కాప్యాకెట్లు, రూ. 10 వేలు విలువ చేసే మద్యం సీసాలతో పాటు నలుగురు రౌడీషీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.