CP Kamalasan Reddy
-
రాచకొండ సీపీగా కమలాసన్?
సాక్షి, సిటీబ్యూరో: కొత్త ఏడాది నుంచి రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు కొత్త బాస్ రానున్నారు. సుదీర్ఘ కాలం నుంచి రాచకొండ పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహేశ్ మురళీధర్ భగవత్ బదిలీ కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయనను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డైరెక్టర్ జనరల్ (డీజీ)గా స్థానచలనం కలి్పంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. రాచకొండ కమిషనరేట్‌కు కొత్త పోలీసు కమిషనర్‌గా 2004 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి వీబీ కమలాసన్ రెడ్డిని నియమించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం కమలాసన్ రెడ్డి హైదరాబాద్, నిజామాబాద్ రేంజ్ ఇన్చార్జి డీఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. ఇటీవల హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో అప్పటివరకు కరీంనగర్ పోలీసు కమిషనర్‌గా ఉన్న కమలాసన్ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసి.. డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసింది. ఆ తర్వాత హైదరాబాద్, నిజామాబాద్ రేంజ్ ఇంచార్జీ డీఐజీగా తాత్కాలిక కాలం పాటు పోస్టింగ్ ఇచ్చారు. పలువురు డీసీపీలు కూడా.. విస్తీర్ణంలో ఢిల్లీ తర్వాత అతిపెద్ద పోలీసు కమిషనరేట్ అయిన సైబరాబాద్ మెట్రోపాలిటన్ పోలీస్‌ను 2016లో విభజించి.. సైబరాబాద్ ఈస్ట్‌కు రాచకొండ పోలీసు కమిషనరేట్‌గా నామకరణం చేశారు. అనంతరం రాచకొండ తొలి సీపీగా మహేశ్ భగవత్ బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒక పోలీసు కమిషనరేట్‌కు వరుసగా ఆరేళ్ల కంటే ఎక్కువ కాలం పోలీసు కమిషనర్‌గా పనిచేసి మహేశ్ భగవత్ రికార్డు సృష్టించారు. ఇదిలా ఉండగా.. సీపీ బదిలీ అనంతరం.. రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో సుదీర్ఘ కాలం నుంచి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు (డీసీపీ)లుగా పనిచేస్తున్న పలువురిని కూడా బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. -
సీపీని అభినందించిన సీఎం కేసీఆర్
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో లాక్‌డౌన్‌ను పగడ్బందీగా అమలు చేస్తున్నందుకు పోలీస్ కమిషనర్ వీబీ.కమలాసన్ రెడ్డిని సీఎం కేసీఆర్ అభినందించారు. లాక్డౌన్ కరీంనగర్ జిల్లాలో అమలవుతున్న విధంగా పక్కనున్న జిల్లాలు జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో పగడ్బందీగా అమలయ్యేందుకు తగు సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా సీపీకి సీఎం సూచించారు. కలెక్టర్ శశాంక మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి, కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి, కరీంనగర్ కార్పొరేషన్ కమిషనర్ వల్లూరి క్రాంతి, జిల్లా అదనపు ఎస్పీ రితిరాజ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. లాక్డౌన్ కఠినంగా అమలు చేయాలి.. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. కరోనా చికిత్స, లాక్డౌన్ అమలు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై శుక్రవారం వరంగల్ నుంచి సీఎం జిల్లా కలెక్టర్లు, జిల్లా సీపీలు, ఎస్పీలు, జిల్లా వైద్యశాఖ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాల వారీగా సమీక్షించారు. లాక్డౌన్ సమయంలో కొంత మంది యువకులు, ప్రజలు అనవసరంగా బయటకు వస్తున్నారని, దీని పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని, కట్టుదిట్టంగా లాక్ డౌన్ అమలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా చికిత్స పకడ్బందీగా అందిస్తున్నామని, అవసరమైన మందులు ఆక్సిజన్ సరఫరా, రెమిడెసివర్ ఇంజక్షన్లు, ఇతర మాత్రలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుధ్య నిర్వహణపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని, రెండు రోజుల్లో ప్రతీ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేటుకు ధీటుగా పారిశుధ్య జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ నెలాఖరు వరకు పూర్తిచేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయిలో నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. -
రాధిక హత్య కేసు: వీడిన మిస్టరీ..
కరీంనగర్ క్రైం: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఇంటర్ విద్యార్థిని రాధిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో కన్నతండ్రే నిందితుడు కావడం గమనార్హం. కూతురనే కనికరం కూడా లేకుండా తండ్రే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. దిండుతో ఊపిరి ఆడకుండా చేసి ప్రాణం తీసి, ఆ తర్వాత కత్తితో గొంతు కోశాడు. అంతేకాకుండా కేసును తప్పుదారి పట్టించేందుకు ఇంట్లో చోరీ జరిగినట్లు నాటకం ఆడాడు. ఫిబ్రవరి 10న విద్యానగర్‌లో రాధిక దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో రాధిక తండ్రి కొమరయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీ కమలాసన్ రెడ్డి సమక్షంలో నిందితుడిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. (చదవండి: హంతకుడు ఎవరు..?!) ఈ సందర్భంగా సీపీ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ.. రాధికకు ఓవైపు వైద్యానికి అయ్యే ఖర్చులు, మరోవైపు పెళ్లి ఖర్చులు భరించలేకే కూతురిని కొమరయ్య హతమార్చినట్లు తెలిపారు. అయితే సీన్ డిస్టర్బ్ చేయకపోవడంతో తండ్రిపై ఎలాంటి అనుమానం రాలేదన్నారు. కొమరయ్య బనియన్, చెప్పులపైకంటికి కనిపించని రక్తపు మరకలను జర్మన్ టెక్నాలజీతో గుర్తించినట్లు వెల్లడించారు. డీఎన్ఏ నిర్థారణతో అదుపులోకి తీసుకుని విచారణ చేయగా తానే రాధికనే హత్య చేసినట్లు నేరం ఒప్పుకున్నాడని తెలిపారు. ఈ కేసులో దాదాపు 60 మందిని విచారించడంతో పాటు 200 మందికిపైగా కాల్‌డేటాలు పోలీసులు పరిశీలించారు. 21 రోజులుగా 8 బృందాలకు సంబంధించి దాదాపు 75 మందికి పైగా పోలీసుల అహర్నిశలు శ్రమించారు. కాగా రాధిక హత్య జరిగిన ఫిబ్రవరి 10 తేదీన కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకుంటూ పోలీసు అధికారులకు సూచనలిచ్చారు. ఇక్కడి క్లూస్‌టీం ఆధారాలతో కొన్ని విషయాలు నిర్ధారణ కాకపోవడంతో సీపీ హైదరాబాద్ నుంచి ప్రత్యేక క్లూస్‌టీం బృందాన్ని కరీంనగర్‌కు రప్పించి జర్మన్ టెక్నాలజీతో ఆధారాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. (చదవండి: క్లైమాక్స్‌కు రాధిక హత్య కేసు..?) లభించిన ఆధారాల నివేదికలతో రాధిక తండ్రిపై పోలీసుల దృష్టి సారించారు. అయితే రాధిక హత్యను పక్కదారి పట్టించేందుకే చోరీ నాటకం ఆడాడు. రాధిక హత్య జరిగిన రోజు ఇంట్లో చోరీ జరిగిందని రూ.99 వేలతో పాటు 3 తులాల బంగారం పోయిందని ఆమె తండ్రి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పొంతన లేని సమాధానాలతో పోలీసులకు కొమరయ్యపై అనుమానం వచ్చింది. దీంతో ఆ కోణంలో పోలీసులు విచారణ చేపట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. -
కరీంనగర్ దాటాలంటే దడ...
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ అక్రమార్కుల గుండెల్లో సింహస్వప్నంగా మారింది. వరుసగా అక్రమాలపై దాడులు చేసి కారకులను కటకటాలకు పంపుతూ శభాష్ అనిపించుకుంటోంది. టాస్క్‌ఫోర్స్ దాడులతో గంజాయి రవాణా, అసాంఘిక కార్యకలాపాలు, వ్యభిచారాలు, నిషేధిత గుట్కా రవాణా, విక్రయాలను వెలికితీస్తూ అక్రమార్కులపై కొరడా ఝలిపిస్తోంది. కరీంనగర్ పోలీసు కమిషనర్ వీబీ.కమలాసన్‌రెడ్డి సారథ్యంలో సమర్థవంతంగా పనిచేసి రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచి అందరి మన్ననలు పొందుతోంది. నిందితులపై నిరంతర నిఘా... కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ విభాగాన్ని పోలీసు కమిషనర్ వీబీ.కమలాసన్‌రెడ్డి 2017, జూలై 01న ప్రారంభించారు. ఇందులో ఇద్దరు సీఐలు , ఒక ఎస్సై, ఒక ఏఆర్ఎస్సై, పది మంది కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో జరిగే అక్రమ దందాలు, అసాంఘిక కార్యకలపాలపై ఈ టీం ప్రత్యేక దృష్టి పెడుతూ ప్రజలతో కలిసిపోతూ సమాచారం సేకరిస్తోంది. యూనిఫాం లేకుండా సివిల్ డ్రెస్సుల్లోనే అక్రమ వ్యాపారాలు, కల్తీ, వ్యభిచారం, పేకాట స్థావరాలు, గుట్కా, గంజాయి రవాణా, ప్రజాపంపిణీ బియ్యం అక్రమరవాణాపై దృష్టి పెట్టి ఆధారాలతో సీపీకి సమాచారమందించి దాడులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం టీంలో సీఐలు ఆర్.ప్రకాశ్, కె.శశిధర్‌రెడ్డి, ఎస్సై వంశీకృష్ణ ఉన్నారు. ఎక్కువ శాతం నిషేధిత గంజాయి వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి కరీంనగర్ మీదుగానే వెళ్తోంది. సీపీ కమలాసన్‌రెడ్డి సూచనల మేరకూ కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ వివిధ సాంకేతిక పరిజ్ఞానం, పట్టిష్టమైన ప్రజాసంబంధాలు ఉండడంతో ముందుగానే అక్రమ రవాణా గురించి తెలుసుకొని చాకచక్యంగా దాడులు చేసి అక్రమార్కులను అరెస్టులు చేస్తున్నారు. వరుసగా దాడులు చేస్తూ పట్టుకోవడంతో అక్రమార్కులు కరీంనగర్ నుంచి తమ వాహనాలు వెళ్లాలంటేనే భయపడేలా టాస్క్‌ఫోర్స్ విభాగం పనిచేస్తోంది. కొన్ని కేసుల్లో అత్య«ధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అసాంఘిక కార్యకాలపాలనూ ఎప్పుటికప్పుడు కట్టడి చేస్తున్నారు. కమిషనరేట్ వ్యాప్తంగా చోరీలకు అడ్డుకట్ట వేయడంతోపాటు, దొంగలను కటకటాలపాలు చేస్తున్నారు. మెరుపుదాడులు.... టాస్క్‌ఫోర్స్ టీం కమిషనరేట్ పరిధిలో వివిధ అక్రమాలపై మెరుపుదాడులు నిర్వహించి అక్రమార్కులను కటకటాలాపాలు చేస్తోంది. సెల్‌టవర్ ఏర్పాటు చేస్తామని కరీంనగర్‌కు చెందిన లైన్మెన్ను నమ్మించి అంతరరాష్ట్ర ముఠా రూ.17 లక్షలు వసూలు చేసింది. ఈ మోసాన్ని టాస్క్‌ఫోర్స్ అధికారులు ఢిల్లీకి వెళ్లి అక్కడే మకాం వేసి ప్రధాన నిందితుడిని పట్టుకున్నారు. కరీంనగర్ మీదుగా తరలుతున్న గంజాయిని పట్టుకుని ఐదు కేసుల్లో 12 మందిని అరెస్టు చేసి రూ.కోటి విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పేకాటా ఆడుతున్న 40 కేసుల్లో 231 మందిని ఆరెస్టు చేసి సుమారు రూ.10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత గుట్కాపై 44 కేసులు నమోదు చేసి 88 మందిని అరెస్టు చేసి రూ.4.5 కోట్ల విలువ చేసే గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి కరీంనగర్ మీదుగా అక్రమంగా తరలిస్తున్న ప్రజాపంపిణీ బియ్యాన్ని సరఫరా చేస్తుండగా 29 కేసుల్లో 33 మందిని ఆరెస్టు చేసి రూ.19 లక్షల విలువ చేసే 1,500 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు. మట్కా కేసులో 12 మందిని అరెస్టు చేసి రూ.75 వేలు పట్టుకున్నారు. నకిలీ విత్తనాలకు సంబంధించిన 2 కేసుల్లో ఏడు గురిని అరెస్టు చేసి రూ.85 లక్షల విలువ చేసే నకిలీ విత్తనాలు సీజ్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిన 13 కేసుల్లో 16 మందిని అరెస్టు చేశారు. ఈ విధంగా అక్రమాలు చేస్తున్న వారిని కటకటాలపాలు చేస్తున్నారు. నిరంతర నిఘా.. కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ పనితీరులో బాగుంది.. కల్తీ దందా చేసేవారు, గంజాయి, నిషేధిత గుట్కా రవాణా చేసే వారిపై నిరంతర నిఘా ఉంటుంది. దాడుల్లో పట్టుపడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు తమ ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై పోలీసులకు సమాచారమందిస్తే వెంటనే దాడులు చేసి పట్టుకుంటాం. –వీబీ.కమలాసన్‌రెడ్డి, కరీంనగర్ పోలీసు కమిషనర్ -
కానిస్టేబుల్‌గా ఎంపికైన వారు రిపోర్టు చేయాలి: సీపీ
సాక్షి, కమాన్‌చౌరస్తా(కరీంనగర్): తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ ప్రకారం 2018–19 కరీంనగర్ జిల్లా యూనిట్‌కు సివిల్/ఏఆర్ పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఈనెల 12, 13 తేదీల్లో ఉదయం 9 గంటలకు కరీంనగర్ సీఏఆర్ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని పోలీసు కమిషనర్ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. రిపోర్టు చేసిన సివిల్/ఏఆర్ పోలీసు కానిస్టేబుల్‌ను శిక్షణ నిమిత్తం కిట్స్ అందజేసి వారికి కేటాయించిన శిక్షణ కేంద్రాలకు 15న తరలించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులకు ముఖ్య సూచనలు... కేటాయించిన సంబంధిత శిక్షణ కేంద్రాల్లో రిపోర్టింగ్ చేసే సమయంలో మెస్, ఇతర చార్జీల కోసం రూ.6 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. (మెస్ చార్జీలు తిరిగి చెల్లిస్తారు) రెండు ఖాకీ నిక్కర్లు, రెండు తెల్ల బనియన్లు (హాఫ్ హ్యాండ్స్) వెంట తీసుకుని రావాలి. బెడ్‌షీట్ మినహా దిండ్లు, ప్లాస్టిక్ బకెట్, కప్పు, బూట్ పాలీష్, బ్రష్, తాళం వెంట తీసుకెళ్లాలి. ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక జిరాక్స్ కాపీ , ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా బుక్, ఆరోగ్య భద్రత కోసం 10 పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఆరోగ్య భద్రత ఫారంలో వివరాలు నమోదు చేసి మొదటి చందా రూ.90 చెల్లించాలి. అదేరోజు నుంచి ఆరోగ్య భద్రత అమల్లోకి వస్తుంది. బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు, సెల్ఫోన్లు శిక్షణ కేంద్రాలకు తీసుకుని రాకూడదు. ఏడు రోజులు అనధికారికంగా హాజరుకాకుంటే శిక్షణ నుంచి తొలిగిస్తారు. -
‘చత్తీస్‌గఢ్ వెళ్లి మావోయిస్టులను కలుస్తున్నట్టు సమాచారం..’
సాక్షి, కరీంనగర్ : శాతవాహన యూనివర్శిటీలోని తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ) పై సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారంపై దర్యాప్తు చేస్తున్నామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి తెలిపారు. పోలీసులే తమపై పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నట్లుగా టీవీవీ నేతలు చేస్తున్న ఆరోపణల్ని ఆయన ఖండించారు. టీవీవీకి మావోయిస్టులతో సంబంధాలున్నట్లు గతంలో చాలా సార్లు రుజువైందని చెప్పారు. టీవీవీలో పనిచేసే కొంతమంది నేతలు తరుచూ చత్తీస్‌గఢ్ వెళ్లి మావోయిస్టు నేతలను కలుస్తున్నట్లుగా మా దగ్గర సమాచారం ఉందని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని నాలుగు పోలీసు స్టేషన్లలో మావోయిస్టులతో సంబంధాలున్నట్లు టీవీవీ నేతలపై కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. అమాయక విద్యార్థులకు మాయమాటలు చెప్పి మావోయిస్టు అజ్ఞాత దళంలో చేర్పించేందుకు టీవీవీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి : చదువులమ్మ ఒడిలో ‘మావో’ల కలకలం!) టీవీవీ రాష్ట్రాధ్యక్షుడు మహేశ్ వద్ద గతంలో విప్లవ సాహిత్యం దొరికిందని గుర్తు చేశారు. అతనిపై నల్గొండ జిల్లాలో పోలీసు కేసు నమోదైందని చెప్పారు. శాతవాహన యూనివర్శిటీలోని టీవీవీ నేతలపై సోషల్ మీడియాలో చేసిన ఆరోపణలపై నిజనిజాలు ఇంకా ధ్రువీకరణ కాలేదని ఎంక్వైరీ చేస్తున్నామని అన్నారు. యూనివర్శిటీ ప్రొఫెసర్ పై వచ్చిన ఆరోపణలపై మాదగ్గర ఆధారాలు లేవని స్పష్టం చేశారు. నక్సల్స్ బాధితుల సంక్షేమం సంఘం పేరుతో సర్క్యులేట్ అవుతోన్న పోస్టులను ఎవరు చేశారో గుర్తిస్తామని చెప్పారు. యూనివర్శిటీలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మావోయిజం వల్ల గడిచిన మూడు దశాబ్దాల్లో తెలంగాణ ప్రాంతంలో ఎంతో మంది చనిపోయారని, ప్రభుత్వం, పోలీసులు తీసుకున్న కఠిన చర్యల వల్ల మావోయిజాన్ని ఇక్కడ లేకుండా చేయగలిగామని సీపీ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. -
కరీంనగర్లో కార్డెన్ సెర్చ్ : 10 బైక్‌లు స్వాధీనం
వీణవంక : కరీంనగర్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సీపీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో వీణవంక మండలం నర్సింగాపూర్‌లో జరిగిన ఈ నిర్బంధ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 10 బైక్‌లు, 4 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. రూ. 20 వేలు విలువ చేసే గుట్కాప్యాకెట్లు, రూ. 10 వేలు విలువ చేసే మద్యం సీసాలతో పాటు నలుగురు రౌడీషీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.