సాక్షి, కమాన్‌చౌరస్తా(కరీంనగర్): తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ ప్రకారం 2018–19 కరీంనగర్ జిల్లా యూనిట్‌కు సివిల్/ఏఆర్ పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఈనెల 12, 13 తేదీల్లో ఉదయం 9 గంటలకు కరీంనగర్ సీఏఆర్ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని పోలీసు కమిషనర్ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. రిపోర్టు చేసిన సివిల్/ఏఆర్ పోలీసు కానిస్టేబుల్‌ను శిక్షణ నిమిత్తం కిట్స్ అందజేసి వారికి కేటాయించిన శిక్షణ కేంద్రాలకు 15న తరలించనున్నట్లు తెలిపారు.
అభ్యర్థులకు ముఖ్య సూచనలు...
- కేటాయించిన సంబంధిత శిక్షణ కేంద్రాల్లో రిపోర్టింగ్ చేసే సమయంలో మెస్, ఇతర చార్జీల కోసం రూ.6 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. (మెస్ చార్జీలు తిరిగి చెల్లిస్తారు)
- రెండు ఖాకీ నిక్కర్లు, రెండు తెల్ల బనియన్లు (హాఫ్ హ్యాండ్స్) వెంట తీసుకుని రావాలి.
- బెడ్‌షీట్ మినహా దిండ్లు, ప్లాస్టిక్ బకెట్, కప్పు, బూట్ పాలీష్, బ్రష్, తాళం వెంట తీసుకెళ్లాలి.
- ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక జిరాక్స్ కాపీ , ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా బుక్, ఆరోగ్య భద్రత కోసం 10 పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఆరోగ్య భద్రత ఫారంలో వివరాలు నమోదు చేసి మొదటి చందా రూ.90 చెల్లించాలి. అదేరోజు నుంచి ఆరోగ్య భద్రత అమల్లోకి వస్తుంది.
- బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు, సెల్‌ఫోన్‌లు శిక్షణ కేంద్రాలకు తీసుకుని రాకూడదు.
- ఏడు రోజులు అనధికారికంగా హాజరుకాకుంటే శిక్షణ నుంచి తొలిగిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment