పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. అయినా భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుష్కర స్నానాలు పూర్తి చేసుకుని, గమ్యస్థానాలకు చేరుతున్నారు. ఇందులో పోలీసులది కీలకపాత్ర. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం, పుష్కర ఘాట్ల వద్ద ఇబ్బందులు కలగకుండా రక్షకభటులు అనుక్షణం అప్రమత్తంగా ఉండి విధులు నిర్వర్తిస్తుండడంతో భక్తులు సాఫీగా పుష్కర యూత్ర పూర్తి చేసుకుంటున్నారు. పుష్కర ఘాట్ల వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల అభిప్రాయూలు..
నాడు విద్యార్థిగా..
డిగ్రీ ఫస్టియర్‌లో కాళేశ్వరంలో పుష్కరాలకు ఎన్‌సీసీ వలంటీర్‌గా సేవలందించాను. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ఎస్సైగా పనిచేస్తున్నాను. భద్రాచలంలో ఎస్సైగా పుష్కర విధుల్లో పాల్గొంటున్నాను. భక్తులకు దారి చూపడం సంతృప్తికరంగా ఉంది.
- ఎం శ్రీనివాస్, ఎస్సై, భద్రాచలం
కష్టంగా ఉన్నా..
జనగామలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాను. పుష్కర విధులు నిర్వహించడం ఎంతో కష్టంగా ఉంది. అరుునా.. పుష్కరాల్లో సేవలందించే భాగ్యం దక్కినందుకు సంతోషంగా ఉంది. పుష్కరాలకు వస్తున్న భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాం.
-లావణ్య, కానిస్టేబుల్, మంగపేట పుష్కరఘాట్
కునుకు లేకుండా..
పుష్కరాలకు లక్షలాది మంది వస్తున్నారు. ట్రాఫిక్‌ను నియంత్రించడంలో తీవ్ర ఒత్తిడి కలుగుతోంది. శని, ఆదివారాల్లో అరుుతే కంటిమీద కునుకు లేకుండా పనిచేశాం. ఎలాంటి సమస్యలు ఎదురు కాకుండా పుష్కరాలు సజావుగా సాగేలా చూస్తున్నాం.
-కిశోర్‌కుమార్, సీఐ ఏటూరు నాగారం
ఆనందంగా ఉంది
పుష్కరాల్లో సేవ చేసే భాగ్యం దక్కినందుకు ఆనందంగా ఉంది. పుష్క ర స్నానాలకు రోజూ లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేం విధులు నిర్వహిస్తున్నాం.
- నాగమణి, కానిస్టేబుల్, ఎస్సారెస్పీ పుష్కరఘాట్