సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు రవాణా సంస్థ (పీటీవో)ను మూసివేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 1956 లో ప్రారంభమైన ఈ సంస్థ రాష్ట్ర కేబినెట్‌తోపాటు, పోలీసుశాఖకు అవసరమైన వాహనాలను సమకూర్చేది. ప్రముఖులందరికీ సుశిక్షితులైన డ్రైవర్లను కూడా ఈ సంస్థే ఏర్పాటు చేసేది. అంతేకాక పోలీసువిభాగానికి అవసరమైన వాహనాలన్నీ పీటీవో ద్వారానే కొనుగోలు చేసేవారు. కాగా, తెలంగాణ సర్కార్ మాత్రం పోలీసు విభాగానికి ఇటీవల కొత్తగా కొనుగోలు చేసిన 350 ఇన్నోవాలు, 1600 పైగా ద్విచక్ర వాహనాలను హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ ద్వారా తెప్పించారు.
అంతేకాక కొత్తగా భ ర్తీచేయనున్న 2600 మంది డ్రైవర్ల రిక్రూట్‌మెంట్ బాధ్యతను కూడా పీటీవో నుంచి తప్పించి హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లకు ఇచ్చారు. దీంతో పీటీవో మూసివేస్తారేమోననే సిబ్బంది ఆందోళనకు బలం చేకూరుతోంది.