అభ్యర్థులతో మాట్లాడుతున్న వీబీ పాటిల్
సాక్షి, వనపర్తి: అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా.. ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని వనపర్తి ఎన్నికల సాధారణ పరిశీలకులు వీ.బీ.పాటిల్ కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి తరపును హాజరైన వారితో సమావేశం నిర్వహించారు.
ఎన్నికల అధికార యంత్రాంగం నిష్పక్షపాతంగా నియమావళికి అనుగుణంగా విధులు నిర్వహిస్తారన్నారు. ఈ సారి ఎన్నికల్లో ఈవీఎంతో పాటు వీవీ ప్యాడ్‌లను కొత్తగా వాడుకలోకి తీసుకువచ్చామని, వాటి గురించి ఓటర్లకు పెద్దఎత్తున అవగాహన కల్పించినట్లు తెలిపారు.
వనపర్తి ఆర్‌ఓ చంద్రారెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు సువిధ యాప్ ద్వారా 155 అనుమతులు ఇచ్చామని, సీ విజిల్‌యాప్ ద్వారా వచ్చిన 51 ఫిర్యాదులను పరిష్కరించామని చెప్పారు. ఇప్పటి వరకు 14 కేసులు బుక్ చేసి ఎఫ్‌ఐఆర్ చేసినట్లు తెలిపారు. సమావేశానికి స్వతంత్ర అభ్యర్థులే ఎక్కువగా హాజరయ్యారు.
త్రీడీ యంత్రంతో ఓటర్లకు అవగాహన
ఆత్మకూర్: రాబోయే ఎన్నికల్లో కొత్తగా ఓటుహక్కు కోసం నమోదు చేసుకున్న ఓటర్లకు పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటును ఎలా వేయాలనే విషయంపై త్రీడీ యంత్రాల ద్వారా అవగాహన కల్పించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్వేతామహంతి ఆదేశాల మేరకు ఆదివారం ఆత్మకూర్ మండలంలోని బాలకిష్టాపూర్‌తండాలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తహసీల్దార్ జెకె.మోహన్ తెలిపారు.
పోలింగ్ కేంద్రంలో ఓటర్లు, మొదటగా ఏ అధికారి వద్దకు వెళ్లాలి.. ఓటు ఎలా వేయాలి అనే విషయాన్ని వివరించామని చెప్పారు. డీటీ విజయసింహ, వీఆర్‌ఓ, వీఆర్‌ఏ. సురేందర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment