‘పాలిటెక్నిక్’ విద్యార్థుల పరేషాన్ | 'Polytechnic' studetns felt in problems | Sakshi
Sakshi News home page

‘పాలిటెక్నిక్’ విద్యార్థుల పరేషాన్

Published Mon, Jun 30 2014 3:19 AM | Last Updated on Sat, Sep 2 2017 9:34 AM

‘పాలిటెక్నిక్’ విద్యార్థుల పరేషాన్

‘పాలిటెక్నిక్’ విద్యార్థుల పరేషాన్

 కమాన్‌చౌరస్తా: పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల భర్తీ నిలిచిపోయింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో సీట్ల కేటాయింపు ప్రక్రియ ఆగిపోయింది. దీంతో ఆప్షన్లు ఎంచుకున్న విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పదిహేను రోజులు గడుస్తున్నా కళాశాలల్లో సీట్లు కేటాయించకపోవడంతో ఇంటర్మీడియెట్ చదువుపై దృష్టి సారిస్తున్నారు. ఈనెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అధికారులు ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లాలో సుమారు 4,806 మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. అనంతరం ఆప్షన్లు కూడా ఎంచుకున్నారు. ఈప్రక్రియ ముగిసి పదిహేను రోజులు గడిచిపోతున్నా విద్యార్థులకు సీట్లు కేటాయించడంలేదు. ఆప్షన్లు ఎంచుకున్న మూడు రోజుల్లో సీట్లు కేటాయించాల్సి ఉన్నా ఇంత వరకు కేటాయించకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నెల 25వ తేదీన సీట్లు కేటాయిస్తామన్న అధికారులు తిరిగి 30వ తేదీ లోగా ప్రవేశాలు కల్పిస్తామని ఠీఠీఠీ.ఞౌడఛ్ఛ్టి.జీఛి.జీలో పేర్కొన్నారు. అయినా అడ్మిషన్లు ప్రారంభం కాకపోవడంతో కొందరు విద్యార్థులు ఇంటర్మీడియెట్ చదివేందుకు ప్రైవేట్ కళాశాలల్లో చేరుతున్నారు.
 
 తొలగని సందిగ్ధత
 ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఇంకా సందిగ్ధం తొలగకపోవడంతో సీట్ల కేటాయింపు రోజుకో మలుపు తిరుగుతోంది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు కేవలం తెలంగాణ విద్యార్థులకే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చే దిశగా అధికారులతో చర్చలు జరిపారు. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని వెలువరించడంలేదు. 1956కు ముందు నుంచి తెలంగాణలో ఉన్న  కుటుంబాలకు చెందిన విద్యార్థులకు మాత్రమే ఫీజు చెల్లించాలనే నిర్ణయానికి వచ్చారు. ఇందుకు అధికారులు సమగ్ర సమాచారాన్ని ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే ఇంకా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. అప్పటి వరకు సీట్ల భర్తీ లేనట్టేనని తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టత ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
 
 అన్నీ ఆటంకాలే
 పాలీసెట్ కౌన్సెంలింగ్  ప్రక్రియ మొదలు కళాశాలల్లో ప్రవేశాల వరకు అన్నీ ఆటంకాలే ఎదురవుతున్నాయి గత సంవత్సరం స్క్రాచ్ కార్డు ద్వారా ఆప్షన్లు ఎంచుకునే పద్ధతి ఉండేది. విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల మాయలో పడకుండా ప్రభుత్వం ఈసారి అభ్యర్థుల సెల్ ఫోన్‌కు పాస్‌వర్డ్ ఇతర సమాచారాన్ని పంపించే పద్ధతికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియలోనూ ఇబ్బందులు తలెత్తాయి. కొందరికి సమాచారం సకాలంలో అందకపోగా, మరి కొందరికి ఆలస్యంగా, ఇంకొందరికి సమాచారమే రాకపోవడంతో విద్యార్థులు అయోమయం చెందారు. నానా తంటాలు పడి  ఆప్షన్లు ఇచ్చిన తర్వాత సీట్ల కేటాయింపులో జాప్యం జరుగుతోంది.
 
 ప్రభుత్వ నిర్ణయం రాగానే సీట్లు కేటాయిస్తాం
 ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం తుది నిర్ణయం వెల్లడించగానే ఆప్షన్లు ఎంచుకున్న విద్యార్థులకు సీట్లు కేటాయిస్తాం. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దు. ఎప్పటికప్పుడు సమాచారమిస్తాం.
 - సాంబయ్య, పాలీసెట్ జిల్లా క్యాంప్ ఆఫీసర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement