'పరిపాలనాదక్షుడు జగ్జీవన్‌రామ్' | Ponguleti Srinivas reddy about Jagjivanram | Sakshi
Sakshi News home page

'పరిపాలనాదక్షుడు జగ్జీవన్‌రామ్'

Published Wed, Apr 6 2016 3:59 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

'పరిపాలనాదక్షుడు జగ్జీవన్‌రామ్' - Sakshi

'పరిపాలనాదక్షుడు జగ్జీవన్‌రామ్'

ఖమ్మం: స్వాతంత్య్ర పోరాటం మొదలు.. ఆ తర్వాత భారత నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన బాబూజగ్జీవన్‌రామ్ గొప్ప పాలనాదక్షుడని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని ఇల్లందు క్రాస్‌రోడ్డులో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జగ్జీవన్‌రామ్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు.

 గాంధీభవన్‌లో ఘనంగా...
 బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలను గాంధీభవన్‌లో మంగళవారం నిర్వహించారు. దేశంకోసం, దళిత జనుల అభివృద్ధికోసం జగ్జీవన్‌రామ్ చేసిన కృషిని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, పార్టీ నేతలు పొన్నాల లక్ష్మయ్య, డి.శ్రీధర్‌బాబు, ప్రసాద్‌కుమార్, మధుయాష్కీ తదితరులు పాల్గొన్నారు.

 బీజేపీ కార్యాలయంలో..
 జగ్జీవన్‌రామ్ జయంతి ఉత్సవాలను బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనూ నిర్వహించారు. జగ్జీవన్‌రామ్ చిత్రపట ం ముందు పుష్పగుచ్చాలను ఉంచి బీజేపీ నేతలు నివాళులు అర్పించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement