నల్గొండ: ఎన్నికల మేనిఫెస్టోలోని అన్ని వాగ్ధానాలను టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం నల్గొండ జిల్లా అంకిరెడ్డి గూడెంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వాలు మారినా రైతుల తలరాతలు మారడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఓటుకు నోటు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబును ఏ1 ముద్దాయిగా చేర్చి... అరెస్ట్ చేయాలని పొంగులేటి డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడటానికి చంద్రబాబు ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.