పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్న తపాల ఉద్యోగులు
బెల్లంపల్లి : వేతన సవరణ చేసి, దీర్ఘకాలం నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తపాలా శాఖ ఉద్యోగులు చేపట్టిన సమ్మె వారం రోజులకు చేరుకుంది. మంగళవారం పట్టణంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన, సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. స్థానిక పాత బస్టాండ్ తపాల కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ బజారుఏరియా, కాంటా చౌరస్తా, ఏఎంసీ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకూ నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ వేతన సవరణ కోసం కమలేష్ చంద్ర కమిటీ నివేదికను అమలు చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతోనే సమ్మెబాట పట్టినట్లు వెల్లడించారు. ప్రభుత్వం డిమాండ్లు పరిష్కరించే వరకూ సమ్మె చేపడతామని హెచ్చరించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారి కిషన్‌కు వినతి పత్రం అందజేశారు.
నిరసనలో జెడ్పీటీసీ సభ్యుడు కారుకూరి రాంచందర్, అఖిల భారత తపాల ఉద్యోగుల సంఘం, పోస్టుమ్యాన్, గ్రూప్ డీ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు బాబురావు, మంచి ర్యాల జిల్లా కార్యదర్శి తాజొద్దీన్, ఆదిలాబాద్ డివి జన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి చింత సంతోష్, మంచిర్యాల బ్రాంచ్ కార్యదర్శి సత్యనారాయణ రావు, రామారావు, నాగేశ్వర్‌రావు, విజయ్, నారాయణ, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment