సంస్థాన్‌నారాయణపురంలోని సర్వేల్ గురుకులం దేశానికే తలమానికం.. అఖిల భారత సర్వీసుకు ఎంతో మందిని అందించిన సరస్వతీ నిలయం.. అవిభాజ్య రాష్ట్రంలోనే మొట్టమొదటి గురుకుల విద్యాలయం. 1971లో నాటి ముఖ్యమంత్రి పీవీ నర్సింహారావు చేతుల మీదుగా పురుడు పోసుకుంది. తెలంగాణ పది జిల్లాలకు స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా పనిచేస్తోంది. వంద మందికిపైగా ఈ పాఠశాల విద్యార్థులు దేశంలోనే అత్యున్నత స్థానాల్లో ఉన్నారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఐఎఫ్‌ఎస్‌లు, డాక్టర్లుగా ఎంపికై, దేశవ్యాప్తంగా సేవ చేస్తున్నారు. అంతటి ఘన చరిత్ర కలిగిన గురుకులం మనుగడకే ప్రస్తుతం ప్రమాదం ఏర్పడింది. సమస్యల వలయంలో కొట్టు మిట్టాడుతోంది. ఆ గురుకులాన్ని, పక్క గ్రామానికే చెందిన మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆదివారం సాక్షి ప్రతినిధిగా మారి అక్కడి సమస్యలను అడిగితెలుసుకున్నారు. సర్వేల్ గురుకులం నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి వీఐపీ రిపోర్ట్...
కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి: మీ పేరేమిటి? గురుకులంలో ఏమేం సమస్యలున్నాయి?
ప్రిన్సిపాల్: నాపేరు కేవీఎన్ ఆచారి. అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గెస్ట్ టీచర్లతో కాలం వెళ్లదీస్తున్నాం. 40ఏళ్ల క్రితం నిర్మిం చిన రేకుల షెడ్లలో తరగతులు నిర్వహిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన ఈ పాఠశాలలో మోడల్ స్కూల్ భవనాన్ని నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు 2, 3కోట్ల రూపాయలు అవసరమవుతాయి. తాగునీటి సమస్య ఉంది.
కూసుకుంట్ల: మీ ఎమ్మెల్యే ఇక్కడ బోరు వేయించిండు అంటున్నరు. మోటారు పెట్టిండ్ర.
ఆచారి: పెట్టలే, మోటారు మంజూరు ఇప్పియ్యలే.
కూసుకుంట్ల: మరి మీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారా?
ఆచారి: తీసుకెళ్లలేదు.
కూసుకుంట్ల : మరి.. ఆయనను కలిసి మోటారు పెట్టించాల్సిన బాధ్యత మీదే కదా.
ఆచారి : నాదే బాధ్యత సర్.
కూసుకుంట్ల: అధ్యాపక పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి. ఎంతకాలం నుంచి ఉన్నాయి?
ఆచారి: ఏడెనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 1996 నుంచి ఇదే పరిస్థితి. గెస్ట్ టీచర్లతో బోధన చేయిస్తున్నాం.
కూసుకుంట్ల: ఎందుకు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా?
ఆచారి : ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. ఇటీవల గురుకుల పాఠశాలల కార్యదర్శి శేషుకుమారి దృష్టికి తీసుకెళ్లా.
కూసుకుంట్ల: గురుకులం గతంలో ఎంతో మందిని అఖిల భారత సర్వీసులకు అందించింది. ఇప్పుడెందుకు ఎంపిక కావడంలేదు.
ఆచారి : 100మందికి పైగా ఈ పాఠశాల విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లకు ఎంపికయ్యారు. లాటరీ పద్ధతిలో విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వడమే కొంపముంచింది. ఆ తర్వాత పక్కనే ఉన్న ఓ విద్యార్థితో మాట్లాడారు.
కూసుకుంట్ల: బాబు నీ పేరేమిటి? ఎక్కడినుంచి వచ్చావు?
విద్యార్థి: సార్! నాపేరు అశోక్. మాది మిర్యాలగూడ.
కూసుకుంట్ల: మీ నాన్న ఏంచేస్తారు. పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నావు?
అశోక్: వ్యవసాయం చేస్తాడు, గొప్ప ఇంజినీర్ కావాలనుకుంటున్నాను.
కూసుకుంట్ల: బాబు నీపేరేమిటి? మీకు ఏమేం సమస్యలున్నాయి?(మరో విద్యార్థినిని ప్రశ్నిస్తూ)
విద్యార్థి: సార్, నా పేరు సతీష్. అన్ని బాగానే ఉన్నాయి.
అనంతరం పదో తరగతి గదిలోకి వెళ్లారు.
కూసుకుంట్ల: సార్! మీ పేరేమిటీ? ఏం బోధిస్తారు?
టీచర్: సార్ నాపేరు శంకరయ్య. గణితం బోధిస్తాను.
కూసుకుంట్ల: ఇది ఏ తరగతి, ఎన్ని సెక్షన్లు ఉన్నాయి?
శంకరయ్య: పదో తరగతి సార్, రెండు సెక్షన్లున్నాయి. 43మంది చొప్పున విద్యార్థులున్నారు.
కూసుకుంట్ల: గత ఏడాది ఎంత మందికి 10 జీపీఏలు వచ్చాయి?
శంకరయ్య: సార్ 80శాతం మందికి 10పాయింట్లు వచ్చాయి. మిగతావారికి 9.8, 9.7 చొప్పున వచ్చాయి.
తరగతిలో ఉన్న ఓ విద్యార్థి దగ్గరికి వెళ్లి బాబు నీ పేరేమిటి? బోధన ఎలా ఉంది?
విద్యార్థి: సార్ నాపేరు రవీంద్రబాబు, బాగా అర్థమవుతోంది.
కూసుకుంట్ల: టీచర్ల ఖాళీలున్నాయని చెబుతున్నారు, అన్ని సబ్జెక్టులు చెబుతున్నారా?
రవీంద్రబాబు: అన్ని సబ్జెక్టులు చెబుతున్నారు. కానీ, ఇంగ్లిష్, గణితం, ఫిజికల్ సైన్స్, తెలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గెస్ట్ టీచర్లతో చెప్పిస్తున్నారు.
తరగతి గదిలొఓ ఇద్దరు ముగ్గురు విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అక్కడినుంచి గ్రౌండ్ దగ్గరికి వెళ్లారు.
కూసుకుంట్ల: బాబు నీ పేరేమిటి?, ఆట వస్తువులున్నాయా?
విద్యార్థి: నాపేరు బూటాసింగ్, సరిగా లేవు, సొంత డబ్బులతో కొనుకుంటున్నాం.
కూసుకుంట్ల: పీఈటీ గారు ప్రభుత్వం ఇవ్వడంలేదా?
పీఈటీ: సార్ నాపేరు అజయ్‌కుమార్, ప్రభుత్వం ఏడాదికి రూ.5వేలే ఇస్తోంది. అందులోనే అన్నీ కొనుగోలు చేయాలి. గ్రౌండ్లు బాగు చేసుకోవాలి.
అక్కడినుంచి సమీపంలోని తాగునీటి ట్యాంకు వద్దకు వెళ్లారు.
కూసుకుంట్ల: బాబు నీ పేరు ఏమిటి? పాఠశాలలో తాగునీటి సమస్య ఉందా?
విద్యార్థి: సార్ నాపేరు నరేశ్, కృష్ణాజలాలు 10, 15రోజులకోసారి వస్తున్నాయి. 40వేల లీటర్ల సామర్థ్యమున్న ఓవర్‌హెడ్ ట్యాంకును పడగొట్టారు. 20వేల లీటర్లదే నిర్మించారు. ఏ మాత్రమూ సరిపోవడంలేదు.
కూసుకుంట్ల: సీఎం కేసీఆర్ ఏదో వాటర్ గ్రిడ్ అంటున్నారు. తెలుసా?
నరేశ్: కేసీఆర్ ఆలోచనలు, నిర్ణయాలు చాలా బాగున్నాయి. వాటర్‌గ్రిడ్ గురిం చి తెలుసు. వాటర్‌గ్రిడ్ ఏర్పాటుతో మా నీటి సమస్య రుతుంద నుకుంటున్నా.
ఎమ్మెల్యే ఏం హామీలిచ్చారంటే..
మోడల్ స్కూల్ భవన నిర్మాణానికి, ఆట వస్తువుల
కొనుగోలుకు, గ్రౌండ్ అభివృద్దికి నిధులిప్పిస్తా.
నిత్యం కృష్ణాజలాలు వచ్చేలా కృషి చేస్తా.
ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకు నిర్మించడంతో పాటు వాటర్‌గ్రిడ్ నుంచి కనెక్షన్ ఇప్పిస్తా.
ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకీ కృషిచేస్తా.
విద్యార్థుల భోజనానికి సన్నబియ్యం ఇప్పిస్తా.
పక్కనే ఉన్న జెడ్పీ హైస్కూల్‌లో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశ పెట్టడంతో పాటు కేజీ నుంచి పీజీ వరకు పాఠశాల స్థాయిని పెంచుతా.
అఖిలభారత సర్వీసులకు 100మందికి పైగా..
సర్వేల్ గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసించిన ఎంతోమంది విద్యార్థులు నేడు అఖిల భారత సర్వీసుల్లో దేశవ్యాప్తంగా సేవలందిస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, ఐఆర్‌ఈఎస్, ఐఆర్‌టీఎస్, ఐటీఎస్ ఇలా ఏ రంగంలో చూసినా ఈ పాఠశాల పూర్వ విద్యార్థులుంటారు. గతంలో ఎస్సెస్సీలో ఈ పాఠశాల విద్యార్థులదే రాషస్థ్రాయి ర్యాంకుల పంట. ఇక్కడి విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్‌లుగా కేంద్ర, రాష్ట్ర సర్వీసులలో ఉద్యోగాలు చేస్తున్నారు. మరికొంత మంది శాస్త్రవేత్తలుగా, వైద్యులుగా, ఇంజినీర్లుగా దేశవిదేశాలలో పనిచేస్తున్నారు. ప్రస్తుత హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, ఐజీ వై.నాగిరెడ్డి, జిల్లా ఎస్పీ డాక్టర్ టి.ప్రభాకర్‌రావు, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్, హైదరాబాద్ జాయింట్ కమిషనర్ బి.మల్లారెడ్డి, సీనియర్ ఐఏఎస్‌లు బి.వెంకటేశ్, ఏ.దినకర్‌బాబు, ఎల్.శశిధర్, జినుకల బాబు, ఐఎఫ్‌ఎస్ డాక్టర్ డీఎన్.రాం బాబు, ఐఆర్‌ఈఎస్ రణదీర్‌రెడ్డి , ఐఆర్‌ఎస్ పి.అంజన్‌కుమార్ త దితరులు ఈ పాఠశాలలో విద్యార్థులే.
వీఐపీ రిపోర్ట్ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
Published Mon, Nov 24 2014 2:35 AM | Last Updated on Sat, Sep 2 2017 4:59 PM
Advertisement
Advertisement