మహారాష్ట్ర సీఈకి స్పష్టం చేసిన తెలంగాణ ఇంజనీర్లు
హైదరాబాద్: ప్రాణహిత నదిపై నిర్మిస్తున్న బ్యారేజీ ఎత్తు తగ్గించాలన్న మహారాష్ట్ర అభ్యర్థనను తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది. ఎత్తును తగ్గిస్తే నీటిమళ్లింపు సాధ్యం కాదని స్పష్టం చేసింది. బ్యారే జీ నిర్మాణంతో ఒక్క గ్రామం కూడా ముంపునకు గురికానప్పుడు బ్యారేజ్ డిజైన్ మార్చాలని కోరడం సమంజసం కాదని తెలిపింది. బ్యారేజీ కారణంగా మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు అక్కడి భూసేకరణ చ ట్టం అనుగుణంగా పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది.
ప్రాణహితపై రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన బ్యారేజీ ఎత్తును 152 మీటర్ల నుంచి 150 మీటర్లకు తగ్గించాలని మహారాష్ట్ర పట్టుబడుతుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యారేజీ డిజైన్, ముంపుప్రాంత అధ్యయనం, ఎఫ్‌ఆర్‌ఎల్‌లపై చర్చించేందుకు మహారాష్ట్ర నాగ్‌పూర్ రేంజ్ చీఫ్ ఇంజనీర్ ఆర్.ఎం.చౌహన్ శనివారం హైదరాబాద్ జలసౌధలోని ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో రాష్ట్ర అధికారులతో సమావేశమయ్యారు.
ప్రాణహిత ఎత్తు తగ్గించలేం
Published Sun, Aug 17 2014 1:08 AM | Last Updated on Mon, Oct 8 2018 6:05 PM
Advertisement
Advertisement