జూన్ 4 నుంచి ఆలయాలు బంద్! | priests gave notices to government that they will close temples from june 4th | Sakshi
Sakshi News home page

జూన్ 4 నుంచి ఆలయాలు బంద్!

Published Wed, May 20 2015 1:11 AM | Last Updated on Sun, Sep 3 2017 2:19 AM

జూన్ 2లోపు పరిష్కరించని పక్షంలో జూన్ 4 నుంచి రాష్ట్రంలోని ఆలయాల్లో ప్రాతఃకాల పూజలు చేసి ఆలయాలను బంద్ చేస్తామని తెలంగాణ రాష్ట్ర దేవాలయ అర్చక, ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

హైదరాబాద్: తెలంగాణ దేవాదాయ శాఖ అర్చక ఉద్యోగుల సమస్యలను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2లోపు పరిష్కరించని పక్షంలో జూన్ 4 నుంచి రాష్ట్రంలోని ఆలయాల్లో ప్రాతఃకాల పూజలు చేసి ఆలయాలను బంద్ చేస్తామని తెలంగాణ రాష్ట్ర దేవాలయ అర్చక, ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

మంగళవారం సచివాలయంలో దేవాదాయ శాఖ కమిషనర్‌కు నోటీసు ఇచ్చిన అనంతరం తెలంగాణ అర్చక సంఘం అధ్యక్షుడు గంగు భానుమూర్తి, సమాఖ్య అధ్యక్షుడు ఉపేంద్రశర్మ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని దేవాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, అర్చకులకు 010 ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని గతంలో పలుమార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినట్లు చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని అలా లేని పక్షంలో జూన్ 4 నుంచి బంద్ చేసి నిరసన తెలుపుతామన్నారు.

Advertisement

పోల్

Advertisement