సీఎంకు గంగపుత్ర సంఘం వినతి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల నియూవుకంలో గంగపుత్రులకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర గంగపుత్రసంఘం సీఎం కేసీఆర్‌ను కోరింది. సంఘ అధ్యక్షుడు దీటి మల్లయ్య ఆధ్వర్యంలో కార్యవర్గసభ్యులు ఆదివారం సీఎం కేసీఆర్‌ను కలసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షలకు పైగా గంగపుత్రులు ఉన్నా.. ప్రస్తుత శాసనసభలో గానీ, శాసనమండలిలోగాని ఒక్కరికీ ప్రాతినిధ్యం లేదని వారు పేర్కొన్నారు. అదేవిధంగా వచ్చే బడ్జెట్‌లో గంగపుత్రుల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించాలని, తెలంగాణ ఫిషరీస్ అడ్వైజరీ బోర్డును ఏర్పాటు చేయాలని వారు వినతిపత్రంలో కోరారు.
చెరువుల పరిరక్షణలో ప్రభుత్వం జారీచేస్తున్న ఆదేశాలను అధికారులు పట్టించుకోకపోవడంతో రామంతాపూర్, కాప్రా చెరువులు నిరాటకంగా కబ్జాకు గురవుతున్నాయని సీఎం దృష్టికి తెచ్చామని సంఘ నాయుకులు తెలిపారు. సీఎంకి వినతిపత్రం సమర్పించిన వారిలో సంఘ రాష్ట్ర కార్యదర్శి గడప దేవేందర్, ప్రధాన కార్యదర్శి కె.కృష్ణ, శీలం రాజ్‌కుమార్, పూస నర్సింహ్మ తదితరులున్నారు.
నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యమివ్వాలి
Published Mon, Oct 20 2014 2:30 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM
Advertisement