⇒ యథేచ్చగా ప్రవేశ పరీక్షలు
⇒ విచ్చలవిడిగా ఫీజుల వసూలు
⇒ పభుత్వ నిబంధనలు గాలికి
⇒ ప్రవేటు పాఠశాలల నిర్వాకం
⇒ పట్టించుకోని విద్యాధికారులు
నిజామాబాద్ అర్బన్: విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే తల్లిదండ్రుల గుండె గుభేలుమంటోంది. ప్రభుత్వ నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోని ప్రవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.
2015-16 సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియను నెల రోజుల క్రితమే ప్రారంభించి నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కాయి. మరోవైపు అధిక ఫీజులు, ప్రవేశ పరీక్షల పక్రియను చూచి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఏడాది కేడాది యాజమాన్యాలు ఫీజుల పట్టికను పెంచేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులపై భారం మోపుతున్నాయి. నియంత్రించాల్సిన విద్యాశాఖ కళ్లప్పగించి చూస్తోంది.
ఇదీ పరిస్థితి
జిల్లాలో 815వరకు ప్రవేటు పాఠశాలలు ఉన్నా యి. ఇందులో 615 వరకు ఉన్నత పాఠశాలలు ఉన్నా యి. ఫిబ్రవరి నుంచే సుమారు 100 పాఠశాలలు అ డ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు. దీని ఆధారంగా సీటును కేటాయిస్తూ, ఫీజును కూడా భారీ గా వడ్డిస్తున్నారు. నగరంలోని ఆర్మూర్ రోడ్డులోని మూడు ప్రయివేటు పాఠశాలలు వార్షిక పరీక్షలు కొనసాగుతుండగానే అడ్మిషన్లను నిర్వహించాయి. ఎల్‌కే జీ నుంచే ప్రవేశ పరీక్షలు జరుపుతున్నారు. ఈ పరీక్ష లు జరిగేటపుడు పాఠశాల సిబ్బందిని కాపాలాగా ఉంచుతున్నారు. ఇతరులు లోనికి రాకుండా ప్రవేశ మార్గాలను మూసివేస్తున్నారు.
వినాయక్‌నగర్‌లోని ఓ ప్రయివేటు పాఠశాల శనివారం ప్రవేశ పరీక్ష నిర్వహించింది. దీనిని అడ్డుకున్న ఏబీవీపీ నాయకులతో పాఠశాల సిబ్బంది వాగ్వివాదానికి దిగారు. అనంత రం ఏబీవీపీ నాయకులు జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. ఇక్కడ రూ. 50 వేల వరకు డొనేష న్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మరి కొన్ని పెద్ద పాఠశాలలు విచ్చలవిడిగా డబ్బులు వసూ లు చేస్తున్నాయి. ఎల్‌కేజీ ప్రవేశానికే రూ. 65 వేల వర కు వసూలు చేస్తున్నారు. ప్రవేశ పరీక్షలో విద్యార్థి ప్రతి భ కనబరచకపోతే మరో రూ.10 వేలు వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కదలని అధికారులు
పాఠశాలల యజమాన్యాలు విచ్చలవిడిగా వసూలు కార్యక్రమం కొనసాగిస్తుంటే విద్యాశాఖ అధికారులు మాత్రం దృష్టి సారించడం లేదు. ఎంఈఓలు తమ పరిధిలోని ప్రరుువేటు పాఠశాలలకు ముందస్తుగానే నియమ నిబంధనలను తెలియజేయూలి. వాటిని పా టించేలా చూడాలి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిపై చర్యలు తీసుకోవాలి. ఈ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. పలుచోట్ల ఎంఈఓలే ప్రవేటు పాఠశాలలకు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు న్నాయి. మరికొన్ని పాఠశాలలు గుర్తింపు లేకుండా కొనసాగుతున్నా పట్టించుకోవడం లేదు. విద్యార్థి సం ఘాలు, తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా చర్యలు లేవు.
దోపిడీకి సిద్ధం
Published Fri, May 1 2015 5:26 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM
Advertisement