- నిలిచిన పాస్‌పోర్టు సేవలు
- పట్టించుకోని ఉన్నతాధికారులు
- ఇబ్బందుల్లో దరఖాస్తుదారులు
టవర్‌సర్కిల్ : జిల్లాలో పాస్‌పోర్ట్ సేవలు మూణ్ణాళ్ల ముచ్చట గానే మిగిలారుు. ఎన్నో బాలారిష్టాలను దాటుకుని 2013ఫిబ్రవరి 8న ప్రారంభమైన లఘు పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో ఆరు నెలలుగా సేవలు నిలిచిపోయాయి. ప్రారంభం రోజు హాజరైన అధికారులు, ప్రజాప్రతినిధులు నెల రోజుల్గోగా పూర్తిస్థాయి సేవలు అందిస్తామని చెప్పినా మాటలు నీటి మూటలుగానే మిగిలారుు. అన్ని సౌకర్యాలతో కార్యాలయూ న్ని ఏర్పాటు చేసి మూసివేశారు. ప్రతి రోజు సేవలు కాకున్నా కనీసం 15 రోజులకోసారైనా క్యాంపు సేవలు అందిస్తారని జిల్లా ప్రజలు ఆశపడితే అది కూడా ఎత్తేశారు. క్యాంపు సేవలు నిలిచి ఆరునెలలైనా అధికారుల్లో స్పందన కరువైంది.
హడావుడి చేసి అటకెక్కించారు
అట్టహాసంగా ప్రారంభమైన మినీ పాసుపోర్ట్ కార్యాలయం అంతే త్వరగా మూతపడింది. మొదట ప్రతి పదిహేను రోజులకోసారి క్యాంపులు నిర్వహించేవారు. మూడు నెలల పాటు సక్రమంగా క్యాంపులు నిర్వహించిన అధికారులు తర్వాత మూడు నెలలు మూసివేశారు. చివరకు ఎన్నికలు ఉన్నాయని ఏప్రిల్‌లో తెరిచి అక్టోబర్ మొదటి వారం నుంచి సేవలు పూర్తిగా ఎత్తేశారు.
ప్రస్తుతం ఆరు నెలలుగా దీని గురించి పట్టించుకోవడం లేదు. ఏడాది గడవకుండానే కథ కంచికి చేరడంతో జిల్లా ప్రజలకు మళ్లీ పాసుపోర్ట్ ఇబ్బందులు మొదలయ్యూరుు. గతంలో హుషారుగా సేవలందించిన పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని కాస్త నిజామాబాద్ తరలించడం, మళ్లీ తిరిగి ప్రారంభించడం, దీన్ని కూడా మూసివేయడం చూస్తే ప్రభుత్వం, అధికారులు ప్రజలను ఏ రీతిలో ఇబ్బందులకు గురిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
సిబ్బందితోనే ఇబ్బంది
కరీంనగర్‌లో మినీ పాస్‌పోర్ట్ కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ పూర్తిస్థాయి సేవలు ప్రారంభించకపోవడంతో హైదరాబాద్ నుంచే సిబ్బందిని పిలిపించి పదిహేనురోజులకు ఒకసారి(శనివారం) క్యాంపు ద్వారా సేవలందించారు. హైదరాబాద్ పాస్‌పోర్టు కార్యాలయంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు సేవలు అందిస్తున్న సిబ్బందికి శనివారం ఇక్కడ విధులు నిర్వహించడం సవాలుగా మారింది. పాస్‌పోర్టు పొందేందుకు వేలసంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకునేందుకు సిద ్ధంగా ఉన్నప్పటికీ కార్యాలయం మూసివేశారని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకొని ప్రజాప్రతినిధులు, అధికారులు జిల్లా కేంద్రంలో పాస్‌పోర్ట్ సేవలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
‘పాస్‌పోర్టు’కు మంగళం!
Published Wed, Apr 15 2015 1:09 AM | Last Updated on Mon, Aug 20 2018 3:09 PM
Advertisement
Advertisement