Passport services
-
AP: రికార్డు స్థాయిలో పాస్‌పోర్ట్ సేవలు
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో పాస్‌పోర్టు సేవలు మెరుగయ్యాయి. ముఖ్యంగా విశాఖ రీజనల్ పాస్‌పోర్ట్ కేంద్రంలో గతంలో మాదిరిగా నెలల తరబడి నిరీక్షణకు చెక్ చెబుతూ.. ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తూ.. దరఖాస్తుల క్లియరెన్స్‌పై దృష్టిసారించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రోజు రోజుకీ దరఖాస్తులు పెరుగుతున్నాయి. ఫలితంగా.. విశాఖ ఆర్పీవో కిక్కిరిసిపోతోంది. రోజుకు 1,290 అపాయింట్మెంట్స్ అందిస్తున్నారు. 2023లో ఏకంగా 1,98,577 పాస్‌పోర్టులు రికార్డు స్థాయిలో జారీ చేయడం విశేషం. ఇక్కడ నుంచి 13 జిల్లాలకు పాస్‌పోర్టు సేవలందుతున్నాయి. ఉపాధి, ఉన్నత విద్య, ఇతర అవసరాల కోసం విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్టు పొందడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. రోజులు, నెలల తరబడి కాళ్లరిగేలా తిరిగినా స్లాట్లు దొరికే పరిస్థితి ఉండేది కాదు. కానీ.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీసుకున్న కీలక నిర్ణయాలతో పాస్‌పోర్టు సేవలు సులువయ్యాయి. దళారుల ప్రమేయం లేకుండానే.. దరఖాస్తుదారుల చేతికి సులువుగా పాస్‌పోర్టు లభిస్తోంది. రాష్ట్రంలోని ప్రధానమైన విశాఖపట్నం ప్రాంతీయ పాస్‌పోర్టు కేంద్రంలో తత్కాల్, సాధారణ అపాయింట్మెంట్లను పెంచి, కాలపరిమితిని తగ్గించడంతో పాటు శనివారం కూడా సేవలు అందిస్తుండటంతో.. పాస్‌పోర్టుల జారీ ప్రక్రియ కూడా వేగవంతమైంది. మరోవైపు పోలీసుల వెరిఫికేషన్ ప్రక్రియ కూడా త్వరితగతిన పూర్తి చేస్తూ.. క్లియరెన్స్ సర్టిఫికెట్స్(పీసీసీ) ఇస్తున్నారు. ఈ సంస్కరణల కారణంగా.. విశాఖపట్నం పాస్‌పోర్టు కేంద్రాల్లో పనితీరు జోరందుకుంది. 2023లో 1,98,577 పాస్‌పోర్టుల జారీ పాత నిబంధనల ప్రకారం పాస్‌పోర్టు కోసం, పోలీస్ విచారణ కోసం నెలల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. ప్రజల సౌలభ్యం కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు దరఖాస్తుతో పాటు నాలుగు పత్రాలుంటే వారం రోజుల్లో పాస్‌పోర్ట్ చేతిలో ఉంటుంది. ఆధార్‌కార్డు(ఇందులో డేట్ ఆఫ్ బర్త్ కచ్చితంగా ఉండాలి). ఎల్రక్టానిక్ ఫొటో ఐడెంటిటీ కార్డు, పాన్ కార్డు ఉండాలి. వీటితో పాటుగా స్థానికత, క్రిమినల్ రికార్డు, ఇంటి చిరునామాతో కూడిన వివరాలు పొందుపరిచి ఉండేలా లాయర్ అఫిడవిట్ ఉంటే చాలు. వీటిలో ఉన్న సమాచారం నిజమని నిర్ధారించుకున్న వెంటనే పాస్‌పోర్టు ఇస్తున్నారు. విశాఖ ప్రాంతీయ కేంద్రంలో పాస్‌పోర్ట్, పోలీస్ క్లియరెన్స్ సర్టీఫికేట్స్ కోసం రోజుకు సగటున 1,290 వరకూ అపాయింట్మెంట్స్ ఇచ్చి దరఖాస్తుల్ని పరిశీలిస్తున్నారు. 2023 జనవరి సమయంలో దరఖాస్తు చేసుకుంటే అపాయింట్మెంట్ 25 పనిదినాల్లోపు ఇచ్చేవారు. ఇప్పుడు కేవలం ఒక్క రోజులో ఇస్తున్నారు. పీవో పీఎస్కేల పరిధిలో విస్తృతంగా సేవలు.. ఏడాదిన్నర కిందట తపాలా కార్యాలయాల్లోనూ పాస్‌పోర్టు సేవలు అందుబాటులోకొచ్చాయి. విశాఖ ఆర్పీవో పరిధిలో రెండు పాస్‌పోర్టు సేవా కేంద్రాలతో పాటు ఏడు పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాలు (పీవోపీఎస్కే) ఉన్నాయి. ఈ పీవోపీఎస్కేల ద్వారానే పోలీస్ క్లియరెన్స్ సర్టీఫికెట్స్(పీసీసీ) స్లాట్లు కూడా జారీ చేస్తుండటంతో పరిశీలన ప్రక్రియ మరింత సులభంగా మారింది. విశాఖ ఆర్పీవో పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశి్చమ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, యానాం జిల్లాలున్నాయి. పారదర్శకంగా సేవలు దరఖాస్తుదారులకు సమీప తేదీల్లో అపాయింట్మెంట్ ఉండేలా చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. రెన్యువల్ కోసం చివరి తేదీ వరకూ ఆలస్యం చేస్తుండటం సరికాదు. ఆరు నెలల ముందుగానే దరఖాస్తు చేసుకుంటే.. పాత పాస్‌పోర్టు గడువు ముగిసేలోగా కొత్త పాస్‌పోర్టు మంజూరవుతుంది. ఏదైనా విచారణ కోసం ఆర్పీవోకి ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 లోపు ఎలాంటి అపాయింట్మెంట్ లేకపోయినా హాజరుకావచ్చు. – విశ్వంజలి గైక్వాడ్ విశాఖ ఆర్పీవో అధికారి -
పెరిగిన పాస్‌పోర్టు సేవలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో పాస్‌పోర్టు సేవలు మెరుగయ్యాయి. గతంలో మాదిరిగా నెలల తరబడి నిరీక్షణకు చెక్ చెబుతూ ప్రాంతీయ పాస్‌పోర్టు కేంద్రాలు (ఆర్‌పీవోలు) ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నాయి. దరఖాస్తుల క్లియరెన్స్‌పై దృష్టిసారించాయి. కరోనా అనంతరం పరిస్థితులు మెరుగుపడుతుండటంతో ఇతర ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రోజురోజుకు దరఖాస్తులు పెరుగుతున్నాయి. విశాఖపట్నం, విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాలు కిక్కిరిసిపోతున్నాయి. ఉపాధి, ఉన్నతవిద్య, ఇతర అవసరాల కోసం విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్టు పొందడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. రోజులు, నెలల తరబడి కాళ్లరిగేలా తిరిగినా స్లాట్ దొరికే పరిస్థితి ఉండేది కాదు. కానీ విదేశీ వ్యవహారాలశాఖ తీసుకున్న కీలక నిర్ణయాలతో పాస్‌పోర్టు సేవలు సులువయ్యాయి. దళారుల ప్రమేయం లేకుండానే దరఖాస్తుదారుల చేతికి పాస్‌పోర్టు లభిస్తోంది. రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నంలో ప్రాంతీయ పాస్‌పోర్టు కేంద్రాలున్నాయి. తత్కాల్, సాధారణ అపాయింట్మెంట్లను పెంచి, కాలపరిమితిని తగ్గించడంతోపాటు శనివారం కూడా సేవలు అందిస్తుండటంతో పాస్‌పోర్టుల జారీప్రక్రియ కూడా వేగవంతం అయింది. మరోవైపు పోలీసులు వెరిఫికేషన్ ప్రక్రియ కూడా త్వరితగతిన పూర్తిచేస్తూ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) ఇస్తున్నారు. ఈ సంస్కరణల కారణంగా పాస్‌పోర్టు కేంద్రాల్లో పనితీరు జోరందుకుంది. వారం రోజుల్లో చేతికి.. కరోనా తర్వాత భారత్‌లో విదేశీ ప్రయాణాలు చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో పాస్‌పోర్టు దరఖాస్తుల సంఖ్య అదే స్థాయిలో పెరుగుతోంది. పాత నిబంధనల ప్రకారం పాస్‌పోర్టు కోసం నెలల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. అన్నిరకాల పత్రాలు సమర్పించాల్సి వచ్చేది. అవన్నీ ఒకేవిధంగా ఉండాలి. వాటిలో ఒక్క చిన్నతప్పు దొర్లినా.. కథ మళ్లీ మొదటికి వచ్చేది. ఒకవేళ అన్నీ ఉన్నా ఇచ్చిన సమాచారాన్ని నిజనిర్ధారణ చేసుకునేందుకు పోలీస్ విచారణ కోసం నెలల సమయం పట్టేది. ప్రజల సౌలభ్యం కోసం విదేశీ వ్యవహారాలశాఖ జారీచేసిన ఆదేశాల మేరకు దరఖాస్తుతోపాటు నాలుగు పత్రాలుంటే చాలు వారం రోజుల్లో పాస్‌పోర్ట్ చేతిలో ఉంటుంది. ఆధార్‌కార్డు (ఇందులో డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి), ఎలక్ట్రానిక్ ఫొటో ఐడెంటిటీకార్డు, పాన్‌కార్డు ఉండాలి. వీటితోపాటు స్థానికత, క్రిమినల్ రికార్డు, ఇంటి చిరునామా వివరాలున్న లాయర్ అఫిడవిట్ ఉంటే చాలు. వీటిలో ఉన్న సమాచారం నిజమని నిర్ధారించుకున్న వెంటనే పాస్‌పోర్టు జారీచేసేస్తున్నారు. పోస్టాఫీసుల్లో సేవలు తపాలా కార్యాలయాల్లోను పాస్‌పోర్టు సేవలు అందుబాటులోకి వచ్చాయి. విజయవాడ ఆర్పీవో పరిధిలో రెండు పాస్‌పోర్టు సేవాకేంద్రాలతో పాటు 13 పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవాకేంద్రాలను (పీవోపీఎస్కేలను) అందుబాటులోకి తీసుకొచ్చారు. విశాఖపట్నం ఆర్పీవో పరిధిలో రెండు పాస్‌పోర్టు సేవాకేంద్రాలతో పాటు ఏడు పీవోపీఎస్కేలున్నాయి. వీటన్నింటి ద్వారా రోజూ 3,020 మంది దరఖాస్తుదారులకు అపాయింట్మెంట్ ఇస్తున్నారు. ఈ పీవోపీఎస్కేల ద్వారానే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) స్లాట్లు కూడా జారీ చేస్తుండటంతో పరిశీలన ప్రక్రియ మరింత సులభతరంగా మారింది. పెరుగుతున్న దరఖాస్తులు కోవిడ్ తర్వాత సేవలు మొదలైనప్పుడు ప్రాంతీయ పాస్‌పోర్టు కేంద్రాలకు రోజుకు సగటున 250 మంది మాత్రమే దరఖాస్తు దారులు వచ్చేవారు. కరోనా ఆంక్షలు పూర్తిగా తొలగిపోవడం, పరిస్థితులు చక్కబడిన తర్వాత స్లాట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. విజయవాడ కార్యాలయంలో రోజుకు 1,860 వరకు అపాయింట్మెంట్స్ ఉండగా, విశాఖ కార్యాలయంలో 1,160 దరఖాస్తుల్ని పరిశీలిస్తున్నారు. శనివారం కూడా పాస్‌పోర్టు సేవలందిస్తుండటంతో తత్కాల్, సాధారణ పాస్‌పోర్టుల కోసం దరఖాస్తులు గణనీయంగా పెరుగుతున్నాయి. పారదర్శకంగా పాస్‌పోర్టు సేవలు ఏపీలో రెండు ప్రాంతీయ పాస్‌పోర్టు కేంద్రాల్లో సేవలు పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. కోవిడ్ తర్వాత దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. వీలైనంత త్వరగా వాటిని క్లియర్ చేస్తున్నాం. పాస్‌పోర్టు కోసం దళారుల్ని ఆశ్రయించవద్దని సూచిస్తున్నాం. పాస్‌పోర్టు సేవల పనిదినాలు కూడా తగ్గాయి. సాధారణ పాస్‌పోర్టు దరఖాస్తులకు 15, సాధారణ తత్కాల్ దరఖాస్తులకు ఎనిమిది రోజులకు పనిదినాలు కుదించాం. దరఖాస్తుదారులకు సమీప తేదీల్లో అపాయింట్మెంట్ ఉండేలా చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. రెన్యువల్ కోసం చివరి తేదీ వరకు ఆలస్యం చేయటం సరికాదు. ఆరునెలల ముందుగానే దరఖాస్తు చేసుకుంటే.. పాత పాస్‌పోర్టు గడువు ముగిసేలోగా కొత్త పాస్‌పోర్టు మంజూరవుతుంది. – విశ్వంజలి గైక్వాడ్, విశాఖ ఆర్పీవో -
సచివాలయాల్లో పాస్‌పోర్టు సేవలు
సాక్షి, అమరావతి: మూరుమూల పల్లెటూళ్లో బాగా చదువుకున్న చాలా మంది యువతకు విదేశాల్లో ఉద్యోగం చేయాలన్నది పెద్ద కల. విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్టు తప్పనిసరి. పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకోవడం వీరికి ప్రయాసతో కూడుకున్న పనే. దగ్గరలో ఉన్న పెద్ద పట్టణానికో, నగరానికో వెళ్లాలి. అక్కడ అన్లైన్లో ఎలాంటి తప్పుల్లేకుండా పాస్‌పోర్టుకు దరఖాస్తు (స్లాట్ బుకింగ్) చేయాలి. వీటి కోసం దళారులు ఒక్కో పాస్‌పోర్టుకు 2 నుంచి 3 వేల రూపాయలు వసూలు చేస్తారు. దరఖాస్తులో తప్పులు దొర్లితే మళ్లీ ప్రయత్నించాలి. గ్రామీణ ప్రజలకు ఇప్పుడా అవస్థలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన గ్రామ సచివాలయాల్లోనే పాస్పోర్టుతో పాటు పాన్‌కార్డు, రైల్వే టిక్కెట్ బుకింగ్ వంటి కొన్ని కేంద్ర ప్రభుత్వ సేవలు కూడా వీటిలో పొందవచ్చు. ఎల్ఐసీ ప్రీమియమూ ఇక్కడే చెల్లించొచ్చు. ఇప్పటివరకు 545 రకాల రాష్ట్ర ప్రభుత్వ సేవలు సచివాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇటీవల పలు కేంద్ర ప్రభుత్వ సేవలు, మరికొన్ని కమర్షియల్ సేవలు సైతం సచివాలయాల ద్వారా పొందే ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది. ఇప్పటికే 98 మందికి పాస్‌పోర్టు సేవలు రాష్ట్రంలో మొత్తం 15,004 గ్రామ, వార్డు సచివాలయాలున్నాయి. అన్ని సచివాయాలల్లోనూ అదనపు సర్వీసులను గ్రామ, వార్డు సచివాలయ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ సేవలపై సచివాలయానికి ఒకరికి చొప్పున సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చింది. ప్రస్తుతానికి 1,600 సచివాలయాల ద్వారా అదనపు సేవలను అందిస్తోంది. వీటికి స్పందన కూడా బాగుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే 98 మంది పాస్‌పోర్టు సేవలను వినియోగించుకున్నట్టు వెల్లడించారు. మరో 484 మంది పాన్‌కార్డు సేవలు వినియోగించుకున్నారు. సచివాలయాల్లో కొత్త సేవల గురించి ‘సిటీజన్ ఔట్ రీచ్’ పేరుతో ప్రతి నెలా రెండు రోజుల పాటు సచివాలయాల సిబ్బంది, వలంటీర్ల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్టున్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. జూన్ నుంచి మరిన్ని సచివాలయాల్లో ఆధార్ సేవలు దాదాపు 500 సచివాలయాల్లో ఇప్పటికే ఆధార్ సేవలందుతున్నాయి. కొత్తగా మరో 2,500 సచివాలయాల్లో ప్రారంభించనుంది. జూన్ నుంచి ప్రతి 5 సచివాలయాల్లో ఒకటి చొప్పున మొత్తం 3 వేల సచివాలయాల్లో ఆధార్ సేవలు అందుబాటులోకి వసాయి. ఇందుకోసం ఒక ల్యాప్‌టాప్, ఐ– స్కానర్, బయోమెట్రిక్ డివైస్ తో కూడిన ఆధార్ కిట్లను సచివాలయాలకు ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. మే నెలాఖరుకలా ఆధార్ కిట్లు చేరతాయని అధికారులు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపుల నిర్వహణకు కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటికీ ఆధార్ నమోదు చేసుకోని వారికి నమోదు చేయిస్తామని అధికారుల తెలిపారు. ఇప్పటికే ఆధార్ నమోదు చేసుకొన్న పిల్లలకు బయోమెట్రిక్ ఆధునీకరణ వంటి సేవలను ఈ క్యాంపుల ద్వారా అందించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా అధికారులు వెల్లడించారు. -
టీసీఎస్ షేర్ల బైబ్యాక్!
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు ప్రతిపాదించింది. ఈ నెల 12న(బుధవారం) నిర్వహించనున్న వాటాదారుల సమావేశంలో కంపెనీ బోర్డు ఈ అంశంపై నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు టీసీఎస్ తెలియజేసింది. ఇదే రోజు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. వెరసి అక్టోబర్– డిసెంబర్(క్యూ3) పనితీరును ప్రకటించనుంది. 2021 సెప్టెంబర్ చివరికల్లా కంపెనీ వద్ద రూ. 51,950 కోట్ల నగదు నిల్వలున్నాయి. ఇన్ఫోసిస్, విప్రో.. ఇంతక్రితం టీసీఎస్ 2020 డిసెంబర్ 18న రూ. 16,000 కోట్లతో సొంత ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను చేపట్టింది. షేరుకి రూ. 3000 ధరలో 5.33 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేసింది. అంతక్రితం 2018లోనూ షేరుకి రూ. 2,100 ధరలో 7.61 కోట్ల షేర్లను బైబ్యాక్ చేసింది. ఇందుకు రూ. 16,000 కోట్లను వెచ్చించింది. గతంలో అంటే 2017లో సైతం ఇదే స్థాయిలో బైబ్యాక్‌ను పూర్తి చేయడం గమనార్హం! ఈ బాటలో ఇతర ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రో తదితరాలు మిగులు నిధులను వాటాదారులకు షేర్ల బైబ్యాక్‌ల ద్వారా పంచుతున్నాయి. 2021 సెప్టెంబర్‌లో ఇన్ఫోసిస్ రూ. 9,200 కోట్లు వెచ్చించి 5.58 కోట్ల సొంత షేర్లను కొనుగోలు చేసింది. ఒక్కో షేరును రూ. 1,538–1,750 మధ్య ధరలో బైబ్యాక్ చేసింది. గత జనవరిలో విప్రో 9,500 కోట్లతో సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలుని పూర్తి చేసింది. బైబ్యాక్ వార్తల నేపథ్యంలో టీసీఎస్ షేరు బీఎస్ఈలో 1.3 శాతం బలపడి రూ. 3,855 వద్ద ముగిసింది. చేజిక్కిన పాస్‌పోర్ట్ సేవా ప్రాజెక్ట్ పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్(పీఎస్పీ) రెండో దశ ప్రాజెక్టును టీసీఎస్ చేజిక్కించుకుంది. తొలి దశ ప్రాజెక్టును చేపట్టి దశాబ్ద కాలంగా నిర్వహిస్తున్న కంపెనీ పౌరులకు పాస్ట్‌పోర్ట్ సేవలను అందించడంలో భారీగా ముందడుగు వేసింది. ఈ బాటలో తాజాగా రెం డో దశ ప్రాజెక్టును సైతం అందుకున్నట్లు టీసీఎస్ తెలియజేసింది. రెండో దశలో ఇప్పటికే ప్రా రంభమైన కీలక అతిపెద్ద ఈగవర్నెన్స్ ప్రోగ్రామ్‌కు కంపెనీ మద్దతివ్వనున్నట్లు పేర్కొంది. గత దశాబ్ద కాలంగా సులభతర సర్వీసులకుగాను ఆధునిక సాంకేతికతలను వినియోగిస్తున్నట్లు తెలియజేసింది. త్వరలో ఈపాస్పోర్ట్.. కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఈపాస్పోర్ట్కు అవసరమైన టెక్నాలజీని త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ అధికారి తేజ్ భట్ల వెల్లడించారు. అయితే పాస్‌పోర్ట్‌కు అనుమతి, ప్రింటింగ్, జారీ తదితర అధికారిక సేవలను ప్రభుత్వమే నిర్వహిస్తుందన్న విషయాన్ని ప్రభుత్వ రంగ బిజినెస్ యూనిట్ హెడ్‌గా పనిచేస్తున్న తేజ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈపాస్పోర్ట్ పూర్తిస్థాయి పేపర్ఫ్రీ డాక్యుమెంట్కాదని.. స్టాంపింగ్ తదితరాలు కొనసాగుతాయని తెలియజేశారు. వీలైనంత వరకూ ఆటోమేషన్ చేయడం ద్వారా అవకాశమున్నచోట పేపర్(డాక్యుమెంట్) అవసరాలను తగ్గిస్తుందన్నారు. కొద్ది నెలల్లో ఈపాస్ట్పోర్ట్కు వీలున్నట్లు అంచనా వేశారు. గత దశాబ్ద కాలంలో 8.6 కోట్ల పాస్‌పోర్ట్‌ల జారీలో సేవలు అందించినట్లు పేర్కొంది. కాగా.. తాజా పీఎస్పీ ప్రాజెక్టు డీల్ విలువను కంపెనీ వెల్లడించలేదు. -
పాస్‌పోర్ట్‌కూ ‘డిజి లాకర్’
సాక్షి, అమరావతి: డిజి లాకర్ సౌకర్యాన్ని కేంద్ర విదేశాంగ శాఖ పాస్‌పోర్ట్‌కు కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. పాస్‌పోర్టు దరఖాస్తుదారులు డిజి లాకర్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని.. తమకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లను అందులో దాచుకోవచ్చు. దీని వల్ల పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లేటప్పుడు సర్టిఫికెట్లను వెంట తీసుకువెళ్లే శ్రమ తప్పుతుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని.. నేరుగా పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లి డిజి లాకర్ ఉందని చెబితే చాలు.. డాక్యుమెంట్లను వాళ్లే వెరిఫై చేస్తారు. ఆన్లైన్లో పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకునే సమయంలోనే డిజి లాకర్ ఆప్షన్ కావాలా? అని అడుగుతుంది. అవసరమని జవాబిస్తే.. మీకు మంజూరయ్యే పాస్‌పోర్ట్ ఒరిజినల్ సైతం డిజి లాకర్లో ఉంచుతారు. దీని వల్ల మన పాస్‌పోర్ట్ ఎక్కడైనా పోతుందేమోననే భయం వదిలిపెట్టవచ్చు. డిజి లాకర్ అంటే.. డిజి లాకర్ అంటే డిజిటల్ లాకర్ అని అర్థం. ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. విలువైన డాక్యుమెంట్లను వెంట తీసుకెళ్లే అవసరం లేకుండా.. కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తూ ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీనికి చేయాల్సిందల్లా http://digilocker.gov.in అనే వెబ్‌సైట్‌కు వెళ్లి అకౌంట్ నమోదు చేసుకోవాలి. అనంతరం మన డాక్యుమెంట్లను అందులో నిక్షిప్తం చేసుకోవచ్చు. వాటిని అవసరమైనప్పుడల్లా ఉపయోగించుకోవచ్చు. గెజిటెడ్ అటెస్టేషన్ కూడా అక్కర్లేదు.. డిజి లాకర్ వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఎవరూ డాక్యుమెంట్లు తీసుకురానవసరం లేదు. గెజిటెడ్ అటెస్టేషన్ అక్కర్లేదు. వారం రోజులుగా దీనిపై ట్రయల్ రన్ నిర్వహించాం. పాస్‌పోర్ట్‌ను కూడా డిజిలాకర్లోదాచుకోవచ్చు. –శ్రీనివాసరావు, ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి, విజయవాడ -
రాష్ట్రంలో 4 కేంద్రాల్లో పాస్‌పోర్ట్ సేవలు
సాక్షి, అమరావతి: ‘‘కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని పోస్టాఫీస్‌లలో పాస్‌పోర్ట్ సేవలు తాత్కాలికంగా నిలిపివేశాం. పరిస్థితిని బట్టి ఈ సేవలను పునరుద్ధరిస్తాం. అత్యవసర పరిస్థితుల్లో పాస్‌పోర్ట్ సేవల కోసం విజయవాడ, విశాఖ, తిరుపతి, భీమవరం పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలను వినియోగించుకోవచ్చు’’ అని ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. పాస్‌పోర్ట్ జారీ, నిర్వహణతోపాటు పలు విషయాలను ఆయన శనివారం ‘సాక్షి’కి వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ► పాస్‌పోర్ట్ సేవలు బాగా సరళతరం అయ్యాయి. చిరునామాతో ఉన్న ధ్రువపత్రాలు (ప్రభుత్వం నిర్ధారించిన ధ్రువపత్రాల జాబితాకోసం పైన పేర్కొన్న వెబ్సైట్ చూడొచ్చు), జనన ధ్రువీకరణకు ఎస్ఎస్సీ లేదా ప్రభుత్వం నిర్ధారించిన పత్రాలలో ఏదైనా ఒక ప్రూఫ్ ఉంటే చాలు. ► అన్ని ధ్రువపత్రాలు కరెక్ట్‌గా ఉండి పోలీస్ క్లియరెన్స్ వచ్చిన తరువాత 5–7 పనిరోజుల్లో పాస్‌పోర్ట్‌ను ఇంటికి చేరుస్తున్నాం. ► గతంలో ఏ ఊరిలో ఉంటే అక్కడే పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడలా లేదు. మీ చిరునామా ఏపీలో ఉన్నా.. నాగపూర్ లేదా ఢిల్లీలో అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ పోలీస్ వెరిఫికేషన్ పూర్తవగానే మీరున్న ప్రస్తుత చిరునామాకు పాస్‌పోర్ట్ వస్తుంది. ► పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకునేవారు వేలాదిమంది నకిలీ వెబ్సైట్ల వలలో పడుతున్నారు. దీనివల్ల ఆర్థికంగా నష్టపోతున్నారు. విదేశాంగశాఖ ఇచ్చిన వెబ్సైట్ మినహా దేన్నీ నమ్మొద్దు. ఆర్డినరీ పాస్‌పోర్ట్‌కు రూ.1,500, తత్కాల్‌కు అదనంగా రూ.2,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకంటే ఒక్క పైసా ఎక్కువ అడుగుతున్నా అది నకిలీ వెబ్సైట్ అని గుర్తించండి. ► నకిలీ వెబ్సైట్లు, బ్రోకర్లను/ఏజెంట్లతో మోసపోవద్దు. కొన్ని నకిలీ అంతర్జాల చిరునామాలతో పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులును మోసం చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. అందువల్ల www.passportindia. gov.inలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. స్మార్ట్‌ఫోన్‌లో mPassport Seva యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ► కరోనా నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారి చిరునామాలు పాస్‌పోర్ట్ నంబర్ ద్వారానే గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చాం. దీనివల్లే వారిని హోం క్వారంటైన్ చేయగలిగారు. -
‘పశ్చిమ’ ముంగిట్లో పాస్‌పోర్ట్ సేవలు
భీమవరం : జిల్లా ముంగిట్లో పాస్‌పోర్ట్ సేవలు అందనున్నాయి. గగన విహారం ఇక సులభతరం కానుంది. భీమవరంలో పాస్‌పోర్ట్ లఘుసేవా కేంద్రాన్ని బుధవారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉభయగోదావరితో పాటు కృష్ణా జిల్లావాసులకు పాస్‌పోర్ట్ సేవలు సులభతరం కానున్నాయి. ఈ ప్రాంతం నుంచి వందలాది మంది ఉద్యోగ, ఉపాధి, విద్య నిమిత్తం విదేశాలకు వెళుతున్నారు. వీరితో పాటు ఇంగ్లండ్, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా దేశాలకు విహార యాత్రకు వెళుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే వీరంతా ఇప్పటి వరకు పాస్ట్‌పోర్ట్ కోసం విశాఖ వెళ్లాల్సి వస్తోంది. రోజుకు 500 మంది వరకు.. ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి రోజూ 500 మంది వరకు పాస్‌పోర్టు కోసం దరఖాస్తులు చేస్తున్నట్టు అంచనా. ఇప్పటి వరకు వీరంతా పాస్‌పోర్ట్ కోసం విశాఖ వెళుతున్నారు. దీంతో సమయంతో పాటు సొమ్ములు ఖర్చవుతున్నాయి. భీమవరంలో పాస్‌పోర్టు కార్యాలయం అందుబాటులోకి రావడంతో వీరి ఇబ్బందులు తీరనున్నాయి. భీమవరం టౌన్ రైల్వేస్టేషన్‌కు దగ్గరలోని పాతబస్టాండ్ పక్కన లఘుసేవా కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు పాస్‌పోర్టు కేంద్రం ఏర్పాటుకు బీజం వేశారు. ఒకానొక దశలో కేంద్రాన్ని రాజమండ్రి తరలించడానికి ప్రయత్నాలు జరిగినా ఎట్టకేలకు భీమవరంలోనే ఏర్పాటుచేశారు. ఐదు రోజులు.. ఆరు కేంద్రాలు సోమవారం నుంచి శుక్రవారం వరకు వారానికి ఐదు రోజులు పాటు పాస్‌పోర్ట్ సేవలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పొందవచ్చు. ఇందు కోసం ఆరు కౌంటర్లు ఏర్పాటుచేశారు. ఎ కౌంటర్లో టోకెన్లు తీసుకుంటారు, బి కౌంటర్లో దరఖాస్తుల పరిశీలన, సీ కౌంటర్లో పాస్‌పోర్టు వివరాల నమోదు చేస్తారు. దరఖాస్తుదారుని వివరాలను విశాఖపట్నం పాస్‌పోర్టు కేంద్రానికి పంపుతారు. అక్కడి నుంచి వారం రోజుల్లో పాస్‌పోర్టు ఇంటికి చేరే అవకాశం ఉంది. పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకునేవారు సాధారణ వ్యక్తులు ఆధార్‌కార్డు, ఓటరు గుర్తింపుకార్డు, ఎనగ్జర్ ఏ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి. విద్యార్థులు కళాశాల నుంచి గుర్తింపు పత్రం, విద్యార్హత, తదితర పత్రాలు సమర్పించాలి. -
ఇకపై వారంతా.. విశాఖకు వెళ్లాల్సిందే!
- పాస్‌పోర్ట్ సేవలపై విదేశీ మంత్రిత్వశాఖ తాజా ఆదేశాలు - నెల్లూరు, ప్రకాశంతో పాటు రాయలసీమ 4 జిల్లాలు హైదరాబాద్‌లోకే సాక్షి, హైదరాబాద్: గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలో ఉన్న యానాం జిల్లా పాస్‌పోర్ట్ సేవలను విశాఖపట్నం పాస్‌పోర్ట్ కార్యాలయానికి బదిలీ చేస్తూ కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నట్టు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి అశ్వనీ సత్తారు తెలిపారు. గుంటూరు, కృష్ణా జిల్లాల వాసులు ఇప్పటి వరకూ పాస్‌పోర్ట్ సేవలకు హైదరాబాద్ కార్యాలయానికి వచ్చేవారు. యానాం వాసులు పుదుచ్చేరి వెళ్లేవారు. అయితే ఇకపై ఈ మూడు జిల్లాలకు చెందిన వారు విశాఖపట్నం వెళ్లాల్సి ఉంటుంది. ఈనెల 22 (నేటినుంచి) పూర్తిగా ఈ సేవలను విశాఖకు బదిలీ చేస్తున్నారు. దీంతో పాటు విజయవాడలో ఉన్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రం కూడా విశాఖపట్నం పరిధిలోకి వస్తుంది. నేటినుంచి గుంటూరు, క్రిష్ణా, యానాం జిల్లాల వాసులు పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకుంటే ఆ పాస్‌పోర్ట్‌పై విశాఖపట్నం కార్యాలయం పేరు మాత్రమే వస్తుంది. విశాఖపట్నం కార్యాలయం పరిధిలోకి వచ్చే జిల్లాలు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కొత్తగా గుంటూరు, కృష్ణా, యానాం జిల్లాలు. మొత్తం 8 జిల్లాలు విశాఖపట్నం పరిధిలోకి ఉంటాయి. విజయవాడలో ఉన్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రం కూడా విశాఖ కార్యాలయం పరిధిలోకే వస్తుంది. హైదరాబాద్ కార్యాలయం పరిధిలోకి వచ్చే జిల్లాలు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, నిజామాబాదాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలు వస్తాయి. తిరుపతిలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రంతో పాటు, తెలంగాణలోని నిజామాబాద్, హైదరాబాద్‌లోని మూడు పాస్‌పోర్ట్ సేవా (అమీర్‌పేట, బేగంపేట, టోలిచౌకి) కేంద్రాలు హైదరాబాద్ కార్యాలయం పరిధిలోకే వస్తాయి. -
విశాఖ, హైదరాబాద్ కేంద్రాలుగా పాస్‌పోర్ట్ సేవలు
విశాఖపట్నం : తెలుగు రాష్ట్రాలలో విశాఖపట్నం, హైదరాబాద్ కేంద్రాలుగా పాస్‌పోర్ట్ సేవలు అందజేయనున్నట్టు విశాఖ పాస్‌పోర్ట్ అధికారి ఎన్.ఎల్.పి.చౌదరి గురువారం తెలియజేశారు. మే 11వ తేదీ నుంచి కొత్త విధానం అమలులోకి రానున్నట్టు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, గుంటూరు, యానాం ప్రాంతాలు విశాఖ కేంద్రం పరిధిలోకి చేరినట్టు పేర్కొన్నారు. ఈ ప్రాంతాల ప్రజలు విజయవాడ లేదా విశాఖలో పాస్‌పోర్ట్ సేవలు పొందవచ్చని తెలిపారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, యానాం ప్రాంత ప్రజలు విజయవాడ, విశాఖ కేంద్రాలలో ఎక్కడి నుంచైనా సేవలు పొందుటకు అవకాశం కల్పించినట్టు వివరించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల ప్రజలు తిరుపతిలో సేవలు పొందాలన్నారు. తెలంగాణకు హైదరాబాద్, నిజామాబాద్ కేంద్రాలుగా అదిలాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలు ఉంటాయని పేర్కొన్నారు. ఆయా జిల్లాల ప్రజలు కొత్తగా అమలులోకి రానున్న విధానంలో సేవలు పొందాలని ఆయన కోరారు. -
‘పాస్‌పోర్టు’కు మంగళం!
- నిలిచిన పాస్‌పోర్టు సేవలు - పట్టించుకోని ఉన్నతాధికారులు - ఇబ్బందుల్లో దరఖాస్తుదారులు టవర్‌సర్కిల్ : జిల్లాలో పాస్‌పోర్ట్ సేవలు మూణ్ణాళ్ల ముచ్చట గానే మిగిలారుు. ఎన్నో బాలారిష్టాలను దాటుకుని 2013ఫిబ్రవరి 8న ప్రారంభమైన లఘు పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో ఆరు నెలలుగా సేవలు నిలిచిపోయాయి. ప్రారంభం రోజు హాజరైన అధికారులు, ప్రజాప్రతినిధులు నెల రోజుల్గోగా పూర్తిస్థాయి సేవలు అందిస్తామని చెప్పినా మాటలు నీటి మూటలుగానే మిగిలారుు. అన్ని సౌకర్యాలతో కార్యాలయూ న్ని ఏర్పాటు చేసి మూసివేశారు. ప్రతి రోజు సేవలు కాకున్నా కనీసం 15 రోజులకోసారైనా క్యాంపు సేవలు అందిస్తారని జిల్లా ప్రజలు ఆశపడితే అది కూడా ఎత్తేశారు. క్యాంపు సేవలు నిలిచి ఆరునెలలైనా అధికారుల్లో స్పందన కరువైంది. హడావుడి చేసి అటకెక్కించారు అట్టహాసంగా ప్రారంభమైన మినీ పాసుపోర్ట్ కార్యాలయం అంతే త్వరగా మూతపడింది. మొదట ప్రతి పదిహేను రోజులకోసారి క్యాంపులు నిర్వహించేవారు. మూడు నెలల పాటు సక్రమంగా క్యాంపులు నిర్వహించిన అధికారులు తర్వాత మూడు నెలలు మూసివేశారు. చివరకు ఎన్నికలు ఉన్నాయని ఏప్రిల్‌లో తెరిచి అక్టోబర్ మొదటి వారం నుంచి సేవలు పూర్తిగా ఎత్తేశారు. ప్రస్తుతం ఆరు నెలలుగా దీని గురించి పట్టించుకోవడం లేదు. ఏడాది గడవకుండానే కథ కంచికి చేరడంతో జిల్లా ప్రజలకు మళ్లీ పాసుపోర్ట్ ఇబ్బందులు మొదలయ్యూరుు. గతంలో హుషారుగా సేవలందించిన పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని కాస్త నిజామాబాద్ తరలించడం, మళ్లీ తిరిగి ప్రారంభించడం, దీన్ని కూడా మూసివేయడం చూస్తే ప్రభుత్వం, అధికారులు ప్రజలను ఏ రీతిలో ఇబ్బందులకు గురిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సిబ్బందితోనే ఇబ్బంది కరీంనగర్లో మినీ పాస్‌పోర్ట్ కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ పూర్తిస్థాయి సేవలు ప్రారంభించకపోవడంతో హైదరాబాద్ నుంచే సిబ్బందిని పిలిపించి పదిహేనురోజులకు ఒకసారి(శనివారం) క్యాంపు ద్వారా సేవలందించారు. హైదరాబాద్ పాస్‌పోర్టు కార్యాలయంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు సేవలు అందిస్తున్న సిబ్బందికి శనివారం ఇక్కడ విధులు నిర్వహించడం సవాలుగా మారింది. పాస్‌పోర్టు పొందేందుకు వేలసంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకునేందుకు సిద ్ధంగా ఉన్నప్పటికీ కార్యాలయం మూసివేశారని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకొని ప్రజాప్రతినిధులు, అధికారులు జిల్లా కేంద్రంలో పాస్‌పోర్ట్ సేవలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. -
విశాఖ కేంద్రంగా ఏపీలో పాస్‌పోర్ట్ సేవలు
మర్రిపాలెం(విశాఖపట్నం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ కేంద్రంగా పాస్‌పోర్ట్ సేవలు ఉంటాయని పాస్‌పోర్ట్ అధికారి ఎన్.ఎల్.పి.చౌదరి ప్రకటించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో విశాఖతో పాటు విజయవాడ, తిరుపతి కేంద్రాలలో ప్రజలు సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల ప్రజలు తిరుపతి కేంద్రంలో, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజలు విజయవాడ కేంద్రంలో, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల ప్రజలు విశాఖ కేంద్రంలో పాస్‌పోర్ట్ సేవలు అందుకోవచ్చని వివరించారు. ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలకు విజయవాడ కేంద్రంలో ప్రత్యేక కౌంటర్లతో సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో అధికారులు విశాఖలో పాస్‌పోర్ట్ సేవలు అన్నట్లు చేసిన ప్రకటన అపోహలకు దారి తీసిందన్నారు. ఇప్పటి వరకూ హైదరాబాద్ కేంద్రంగా సేవలు అందుతోన్న రాయలసీమ జిల్లాలు కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలను విశాఖ కేంద్రానికి అనుసంధానం చేసినట్టు తెలిపారు. ఆయా జిల్లాల ప్రజలకు ఎప్పటి మాదిరిగానే విజయవాడ, తిరుపతిలలో పాస్‌పోర్ట్ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. విశాఖలో పాస్‌పోర్ట్ కార్యాలయం ‘పాస్‌పోర్ట్ సేవ ఎట్ యువర్ డోర్ స్టెప్’గా పనిచేస్తుందన్నారు. -
పాస్‌పోర్ట్ సేవలన్నీ ఇక విశాఖలో..
-
పాస్‌పోర్ట్ సేవలన్నీ ఇక విశాఖలో..
వెల్లడించిన ఆర్పీవో అశ్విని ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలకు అక్కడినుంచే సేవలు త్వరలోనే ప్రక్రియ పూర్తి విజయవాడ, తిరుపతి సేవా కేంద్రాలు విశాఖకు అనుసంధానం అత్యధిక పాస్‌పోర్టులు జారీ చేసిన హైదరాబాద్ కేంద్రం సీమ సమస్యలపై కేంద్రానికి లేఖ రాస్తా: ఎంపీ మిథున్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇకపై పాస్‌పోర్ట్ సేవలన్నీ విశాఖపట్నం కేంద్రంగా అందిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయం తెలంగాణలోని 10 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లోని 8 జిల్లాలకు సేవలు అందిస్తోంది. ఇకపై ఏపీలోని ఆ 8 జిల్లాల సేవలు కూడా విశాఖపట్నంలోని పాస్‌పోర్ట్ కార్యాలయానికి బదలాయిస్తున్నట్టు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి (ఆర్పీవో) అశ్విని సత్తారు వెల్లడించారు. గురువారం ఆమె డిప్యూటీ పాస్‌పోర్ట్ అధికారి ఎల్.మదన్‌కుమార్‌రెడ్డితో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విశాఖ పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి ఇప్పటికే ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలకు సేవలు అందుతున్నాయని, ఇకనుంచి మిగిలిన జిల్లాల సేవలను కూడా విశాఖకు బదలాయిస్తున్నట్టు ఆమె తెలిపారు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. పాస్‌పోర్ట్ సేవలను బదలాయించడంతో పాటు ఏపీలోని విజయవాడ, తిరుపతిలో ఉన్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు కూడా విశాఖపట్నం పాస్‌పోర్ట్ కార్యాలయానికే అనుసంధానిస్తున్నట్టు తెలిపారు. వీలైనంత త్వరలో ఈ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. 2014 సంవత్సరంలో 7.17 లక్షల పాస్‌పోర్ట్ దరఖాస్తులను స్వీకరించి, 6.95 లక్షల పాస్‌పోర్ట్‌లను జారీ చేసి హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. పాస్‌పోర్ట్‌ల జారీలో 13 శాతం వృద్ధి నమోదైందని చెప్పారు. చేతిరాత పాస్‌పోర్ట్‌లు చెల్లవు గతంలో చేతిరాతతో పాస్‌పోర్ట్‌లు తీసుకున్న వారు ఈ ఏడాది నవంబర్ 24వ తేదీలోగా తిరిగి దరఖాస్తు చేసుకుని, మిషన్ రీడబుల్ పాస్‌పోర్ట్ (ఎంఆర్పీ)లు తీసుకోవాలని ఆమె చెప్పారు. అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ నిర్ణయం మేరకు ప్రపంచ దేశాలన్నీ ఈ విధానాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. ఈ ఏడాది నవంబర్ తర్వాత చేతిరాత ఉన్న పాస్‌పోర్ట్‌లు చెల్లవన్నారు. ఇకపై వీసా కోసం వెళ్లేవారు ఆరు మాసాల పాస్‌పోర్ట్ కాలపరిమితి కలిగి ఉండాలని, లేదంటే ముందుగానే దరఖాస్తు చేసుకుని కొత్త పాస్‌పోర్ట్ పొందాలన్నారు. పాస్‌పోర్ట్ కాలపరిమితి ఏడాది ఉన్నా కొత్త పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చాన్నారు. మైనర్లు మేజర్లుగా మారుతుంటే వారుకూడా కొత్త పాస్‌పోర్ట్‌లు తీసుకోవాలన్నారు. వీసా పేజీల పెంపు కోసం అభ్యర్థులు రీయిష్యూ కింద దరఖాస్తు చేసుకుని, 60 పేజీల జంబో బుక్లెట్ పాస్‌పోర్ట్‌ను పొందవచ్చునని అన్నారు. వచ్చే ఏడాది ఇ-పాస్‌పోర్ట్‌లు (చిప్‌తో కూడిన) ఇచ్చే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ఈ ఏడాది హజ్‌యాత్రలకు వెళ్లే అభ్యర్థుల పాస్‌పోర్ట్‌ల జారీకి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు అశ్విని పేర్కొన్నారు. ఇక హజ్ యాత్రీకులకు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్, ఆంధ్రలోని కృష్ణా జిల్లాల్లో పోలీసు విచారణ త్వరగా పూర్తవుతోందని, అది పూర్తయిన ఐదు రోజుల్లోనే పాస్‌పోర్ట్‌ను జారీ చేస్తున్నామని అశ్విని చెప్పారు. పాస్‌పోర్టు ఏజెంట్లు భారీ వసూళ్లపై విలేకరులు ప్రశ్నించగా.. ఆన్లైన్లో పాస్‌పోర్ట్ దరఖాస్తు బాధ్యతలను త్వరలోనే పోస్టాఫీసులకు అప్పజెప్పబోతున్నామని వెల్లడించారు. సీమ సమస్యపై ప్రభుత్వ ప్రతిపాదనలు లేవు పాస్‌పోర్ట్ సేవలు విశాఖపట్నానికి తరలిస్తే రాయలసీమ జిల్లాలతో పాటు గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా ఉంటుందని, ప్రయాణం భారంగా ఉంటుందని విలేకరులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. దీనికి అశ్విని స్పందిస్తూ.. ఇలాంటి ఇబ్బందులు తమకు కూడా తెలుసునని, కేంద్ర నిర్ణయాన్ని తాము కాదనలేమన్నారు. అయితే ఇలాంటి సమస్యలపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు ఇవ్వలేదని అన్నారు. ఒకవేళ ఏమైనా ప్రతిపాదనలు వస్తే కేంద్రానికి పంపుతామన్నారు. ప్రజల ఇబ్బందులు ప్రభుత్వం గుర్తించదా? పాస్‌పోర్ట్ సేవలు విశాఖపట్నానికి తరలిస్తే రాయలసీమ జిల్లాల వాసుల పరిస్థితి ఏమిటి? చిన్నపనైనా 700 కిలోమీటర్లు వెళ్లగలరా? నా నియోజకవర్గం నుంచి వేలాది మంది గల్ఫ్ దేశాలకు వెళుతుంటారు. వాళ్లలో చాలామంది నిరక్షరాస్యులు. వారు విశాఖపట్నం వెళ్లగలరా? అసలు దరఖాస్తుదారుల ఇబ్బందులు ఈ ప్రభుత్వం గుర్తించలేదని స్పష్టమైంది. అందరికీ అందుబాటులో పాస్‌పోర్ట్ సేవలు ఉండేలా చేయాలని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు, విదేశాంగ కార్యదర్శికి లేఖ రాస్తా. అవసరమైతే పార్లమెంటులో దీనిపై ప్రశ్నిస్తా. -పి.మిథున్‌రెడ్డి, పార్లమెంట్ సభ్యులు, రాజంపేట -
త్వరలో పాస్‌పోర్టు సేవలు
భీమవరం టౌన్ : తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలకు అందుబాటులోకి తీసుకోచ్చేందుకు భీమవరంలో ఏర్పాటు చేసిన పాస్‌పోర్టు కార్యాలయాన్ని త్వరలో ప్రారంభిస్తామని పార్లమెంటు సభ్యులు గోకరాజు గంగరాజు తెలిపారు. శనివారం భీమవరం డీఎన్ఆర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన పాస్‌పోర్టు మేళాను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పాస్‌పోర్టు కార్యాలయం విషయమై ఇటీవల విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ను కలిసి మాట్లాడినట్టు తెలిపారు. రాజ్యసభ సభ్యులు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ మన పెద్దలు పాస్‌పోర్టు కోసం మద్రాసు వెళ్లేవారని, ఇప్పుడు భీమవరంలో పాస్‌పోర్టు కార్యాలయం ప్రారంభిస్తామన్నారు. ఎమ్మెల్యేలు పుల పర్తి రామాంజనేయులు, కలవపూడి శివ మాట్లాడారు. పాస్‌పోర్ట్ అధికారి ఎల్ఎన్పి. చౌదరి మాట్లాడుతూ ఏజెంట్లను నమ్మి జేబులు ఖాళీ చేసుకోవద్దని దరఖాస్తుదారులకు సూచిం చారు. ఆదివారం కూడా ఈ మేళాను నిర్వహిస్తున్నామన్నారు. మున్సిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు, డీఎన్నార్ కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు వెంకటనర్శింహరాజు, గాదిరాజు సత్యనారాయణరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, గోకరాజు రామరాజు, ప్రిన్సిపాల్ పి. రామకృష్ణంరాజు, పోత్తూరి ఆంజనేయులరాజు, చెరుకువాడ రంగసాయి పాల్గొన్నారు. -
స్లాట్ బుకింగ్‌కు అందని ‘మీ-సేవ’
పని ఒత్తిడితో సేవలు నిల్ బుక్ చేసే కేంద్రాలు తెలియక ప్రజల పాట్లు విశాఖపట్నం: పాస్‌పోర్ట్ సేవలు ‘మీ-సేవ’ కేంద్రాలలో పొందవచ్చని అధికారులు ప్రకటించారు. ఆగస్టు 15 నుంచి కేంద్రాలలో సేవలు ప్రారంభించారు. అయితే ‘మీ-సేవ’ కేంద్రాలలో ఈ సేవలు సంతృప్తికరంగా అందడం లేదు. బ్రోకర్లు, దళారీల వ్యవస్థ నియంత్రణకు సిద్ధపడ్డ పాస్‌పోర్ట్ అధికారులు తొలి విడతగా ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన 200మంది ‘మీ-సేవ’ ప్రతినిధులకు ఈ ఏడాది జూలై 19న పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో శిక్షణ ఇచ్చారు. ఆన్లైన్లో పాస్‌పోర్ట్ బుకింగ్, దరఖాస్తులు పూరించడం, ఫీజులు చెల్లించడాన్ని నేర్పించారు. పాస్‌పోర్ట్ సేవలు గురించి అవగాహన కల్పించారు. మరో రెండు విడతలుగా శిక్షణ ఉంటుందని అధికారులు ప్రకటించారు. తర్వాత శిక్షణ ప్రస్తావన మరిచారు. ప్రతి జిల్లాలో 213 ‘మీ-సేవ’ కేంద్రాలు అందుబాటులో ఉండగా పది శాతం కేంద్రాలలో కూడా సేవలు లభించడం లేదు. గందరగోళంగా సేవలు... గ్రామీణ ప్రాంత ప్రజలకు పాస్‌పోర్ట్ సేవలు మరింత దగ్గర చేయాలన్న లక్ష్యంతో ‘మీ-సేవ’ కేంద్రాలలో సేవలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర సర్వీసులతో సంబంధం లేకుండా కేంద్ర సర్వీసులతో పాస్‌పోర్ట్ సేవలు అనుసంధానం చేశారు. ఆన్లైన్లో పాస్‌పోర్ట్ సేవలకు సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షణ ఉండేటట్టు చర్యలు చేపట్టారు. అయితే ఏ కేంద్రంలో పాస్‌పోర్ట్ సేవలు లభిస్తాయో ప్రజలకు అర్థం కావడం లేదు. రూ.100 చెల్లించి సేవలు పొందవచ్చని ఆశపడుతున్న ప్రజలకు నిరాశ తప్పడం లేదు. ‘మీ-సేవ’ కేంద్రంలో ఒక కౌంటరే పనిచేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరెంట్, విద్యుత్, ఇంటి పన్నులతోపాటు పాస్‌పోర్ట్ సేవల కోసం అభ్యర్థులు వేచి ఉంటున్నారు. రద్దీ సమయంలో పాస్‌పోర్ట్ సేవలు చేయలేమని కేంద్రాలలో చెబుతుండటంతో కంగుతింటున్నారు. అన్ని కేంద్రాలలో ప్రారంభించాలి... ప్రతి ‘మీ-సేవ’ కేంద్రంలో పాస్‌పోర్ట్ సేవలు లభించేటట్టు అధికారులు చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. పాస్‌పోర్ట్ సేవల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలంటున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఆన్లైన్ సేవలలో అడ్డంకులు, విద్యుత్ సరఫరా అంతరాయంతో పనులు జరగడం లేదని వాపోతున్నారు. ప్రత్యేక మేళాలలో స్లాట్ బుకింగ్‌లు దొరకపోవడంతో నీరుగారుతున్నారు. మేళాలో పాల్గొనడానికి తప్పనిసరి పరిస్థితుల్లో బ్రోకర్లను ఆశ్రయిస్తున్నట్టు చెబుతున్నారు. చేపట్టాల్సిన చర్యలు ఆయా జిల్లా, మండలాలలో పాస్‌పోర్ట్ సేవలు లభించే ‘మీ-సేవ’ కేంద్రాల వివరాలు తెలియజేయాలి. ‘మీ-సేవ’ కేంద్రాలలో పనితీరును అధికారులు పర్యవేక్షించాలి, లోటుపాట్లను అధిగమించాలి. స్లాట్ బుకింగ్‌లు ప్రజలకు మరింత చేరువ చేయాలి. బ్రోకర్ల స్థావరాలపై ఎప్పటికప్పుడు దాడులు నిర్వహించాలి. ప్రత్యేక మేళాల బుకింగ్‌లు జరుగుతున్న తీరుపై నిఘా ఉంచాలి.