
సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలో కీలకంగా పనిచేసే కానిస్టేబుళ్లకు పది రోజుల్లో హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడేలా కృషి చేస్తామన్నారు. మంగళవారం రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులతో పాటు జిల్లాల బాధ్యులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. పోలీసులు అంకిత భావంతో పని చేయాలన్నారు. యూనిఫాం అలవెన్సును పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఆర్డర్ టూ సర్వ్ కింద కొత్త జిల్లాల్లో పనిచేస్తున్న సిబ్బందిని వారి సొంత జిల్లాలకు పంపేలా చూస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకున్నట్టుగానే ఈహెచ్‌ఎస్ (ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్) ను పోలీసులకు కూడా వర్తించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని అధికారులకు డీజీపీ హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఎస్సైలకు గెజిటెడ్ హోదాతో పాటు వారాంతపు సెలవు, ప్రత్యేక పీఆర్సీ, డబుల్ బెడ్రూం ఇళ్లు తదితర అంశాలపై అధికారుల సంఘం డీజీపీ దృష్టికి తీసుకెళ్లింది. ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్‌చంద్, ఐజీలు శివధర్‌రెడ్డి, సౌమ్యామిశ్రా, సంజయ్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment