
బ్యాంకుల వద్ద నేడు నిరసనలు: కోదండరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రైతులకు నగదు కొరత సృష్టించిన బ్యాంకు ల తీరుకు నిరసనగా శుక్రవారం బ్యాంకుల ఎదుట ధర్నాలు చేయనున్నట్టు టీపీసీసీ కిసాన్‌సెల్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి గురు వారం చెప్పారు.
రైతులకు రుణమాఫీ జరగలేదని, అప్పులు బ్యాంకుల్లో ఎప్పటిలాగానే ఉన్నాయని అన్నారు. కేసీఆర్ గొప్పలు చెప్పుకోవడంతప్ప రైతులను ఆదుకోవడంలేదన్నారు. కోదండరెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ వేసిన విస్తరాకులో తింటున్న సీఎం కేసీఆర్ నోటికొచ్చినట్టుగా మాట్లాడటం సరికాదని హెచ్చరించారు.