మోర్తాడ్(బాల్కొండ): కువైట్ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టడంతో అక్కడి మన రాయబార కార్యాలయం వద్ద ఔట్ పాస్ కోసం ఎదుట స్వదేశానికి వచ్చేందుకు కార్మికులు క్యూ కడుతున్నారు. రాష్ట్రానికి చెందిన సుమారు 50 వేల మంది కార్మికులు కువైట్‌లో అక్రమంగా ఉంటున్నారు.
ఏజెంట్ల మోసాలు యజమానుల వంచన నేపథ్యంలో చట్టబద్ధంగా అక్కడ ఉండలేక ఇంత కాలం ఇబ్బందులు పడుతూ బతికారు. ఏడేళ్ల తర్వాత కువైట్ ప్రభుత్వం క్షమాభిక్షను అమలు చేసింది. ఇందుకోసం ఫిబ్రవరి 22 వరకు గడువు విధించింది. దీనితో లబ్ధి పొందే కార్మికులలో తెలంగాణ వారే అధికంగా ఉన్నారు. వీరంతా ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వదేశానికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 2016 చివరి రోజుల్లో అక్కడి పోలీసులు దాడులు నిర్వహించి వందలాది మందిని అరెస్టు చేశారు. వారంతా జైళ్లలోనే మగ్గుతున్నారు.
ప్రభుత్వం టికెట్‌లను సమకూర్చాలి
కువైట్ నుంచి తిరిగి రావడానికి ఔట్ పాస్‌లు పొందుతున్న కార్మికులకు ప్రభుత్వం విమాన టికెట్‌లను అందించాలి. కార్మికులు మన దేశానికి రాలేని పరిస్థితుల్లోనే రహస్యంగా ఉండిపోయారు. దీనిని గుర్తించి ప్రభుత్వం టికెట్‌లను సమకూరిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది.
– పాట్కూరి బసంత్‌రెడ్డి, గల్ఫ్ తెలంగాణ సాంస్కృతిక మండలి అధికార ప్రతినిధి
కువైట్‌లో క్యూ కడుతున్న కార్మికులు
Published Thu, Feb 1 2018 3:36 AM | Last Updated on Thu, Feb 1 2018 3:36 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment