వరంగల్: పలు అభివృద్ధి పనులను ప్రారంభించడానికి సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఆశీష్ అగర్వాల్ బుధవారం వరంగల్ రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్ లో కొత్తగా ఏర్పాటు చేసిన ఎస్క్‌లేటర్‌తో పాటు 3 ఆటోమెటిక్ టికెట్ వెండిగ్ మిషన్‌లను ఆయన ప్రారంభించారు. స్టేషన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఉన్నత శ్రేణి ప్రయాణికుల ఏసీ వెయిటింగ్ హాల్‌ను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో మాట్లాడి సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.
(మట్టెవాడ)
రైల్వే స్టేషన్‌ను సందర్శించిన డీఆర్‌ఎం
Published Wed, Jun 3 2015 12:17 PM | Last Updated on Sun, Sep 3 2017 3:10 AM
Advertisement
Advertisement