వెంకట్రాంరెడ్డికి సమున్నత గౌరవం
సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో త్వరలో ఘనంగా రెడ్డి హాస్టల్ శతాబ్ది వేడుకలు
స్మారక నిర్మాణం కోసం బుద్వేల్‌లో స్థలం కేటాయింపు
సీఎం కె.చంద్రశేఖర్‌రావు
సాక్షి, హైదరాబాద్: నిజాం కాలంలో విద్యా వ్యాప్తికి కృషిచేసిన తెలంగాణ వైతాళికుడు రాజా బహదూర్ వెంకట్రాంరెడ్డిని ఘనంగా స్మరించు కోవడానికి, భావితరాలకు ఆయన గొప్పతనం తెలిపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎం కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. వెంకట్రాంరెడ్డి కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్‌లో సమున్నతంగా ప్రతిష్టించేందుకు అనువైన స్థలాన్ని గుర్తించా ల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు. వెంకట్రాంరెడ్డి స్మారక నిర్మాణం కోసం రాజేం ద్రనగర్ మండలం బుద్వేల్‌లో 10 ఎకరాల స్థలం కేటాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వెంకట్రాంరెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ రఘుపతిరెడ్డికి సీఎం శనివారం ప్రగతిభవన్ లో అందించారు. కార్యక్రమంలో ఎంపీ జితేం దర్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్‌చైర్మన్ ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. వెంకట్రాంరెడ్డి స్థాపించిన రెడ్డి హాస్టల్ వందేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించను న్నట్లు ప్రకటించారు. త్వరలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తామని వెల్ల డించారు.
సాంస్కృతిక శాఖకు కార్యక్రమాల నిర్వహణ బాధ్యత అప్పగిస్తామన్నారు. వెంక ట్రాంరెడ్డి తెలంగాణలో అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించారని, దాదాపు 14 విద్యాసంస్థలు నెలకొల్పారని కొనియాడారు. ఆయన స్థాపించిన విద్యా సంస్థల్లో మాజీ ప్రధాని పీవీ నరసింహరావు లాంటి వారెం దరో చదువుకుని ఉన్నతస్థాయికి ఎదిగారని గుర్తుచేశారు. బాలికల విద్యను ప్రోత్సహించ డానికి ఆయన చేసిన కృషిని ప్రశంసించారు. ఆయన చేసిన కృషి సమైక్య పాలనలో విస్మరణకు గురైందన్నారు. రెడ్డి హాస్టల్ సమీ పంలోని నారాయణగూడ చౌరస్తాకు కొత్వాల్ వెంకట్రాంరెడ్డి పేరు పెట్టుకున్నా ఆ పేరు ప్రచారంలోకి రాకుండా చేశారన్నారు. తెలం గాణ వైతాళికులకు గుర్తింపు, గౌరవం దక్కి తీరాలని సీఎం ఆకాంక్షించారు. వెంకట్రాంరెడ్డి స్మారకం నిర్మించడంతో పాటు అదే ప్రాంగ ణంలో కల్యాణ మండపం నిర్మించాలని, అందులో రెడ్డి కులానికి చెందిన పేదలకు ఉచి తంగా వివాహాలు జరపాలని సీఎం సూచించా రు. స్మారకం, కల్యాణ మండపం నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వెంకట్రాంరెడ్డి స్వగ్రామమైన మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం రాయపేటలో త్వరలో జరిగే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాలని రఘుపతిరెడ్డి, జితేందర్‌రెడ్డి ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.