అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
మహబూబ్‌నగర్ : అక్రమంగా తరలిస్తున్న 50 క్వింటాల రేషన్ బియ్యాన్ని పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా గోపాలపేట మండలం బొడ్డారం గండి దగ్గర వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న మూడు ఆటోలను గుర్తించారు. వెంటనే తహశీల్దార్‌కు సమాచారం అందించడంతో రెవెన్యూ అధికారులు 99 బియ్యం బస్తాలతో కూడిన మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. నాగర్ కర్నూలుకు చెందిన కొంతమంది వ్యాపారస్థులు అక్రమంగా బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌లో అమ్మడానికి తీసుకెళ్తున్నట్లు సమాచారం.
(గోపాల్‌పేట)