♦ 82.5 క్వింటాళ్ల రేషన్ బియ్యం,3 క్వింటాళ్ల చక్కెర, 80 లీటర్ల కిరోసిన్ స్వాధీనం
♦ ఇంటి యాజమానిపై కేసు నమోదు
నర్మెట : ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన రేషన్‌బియ్యం, చక్కెర, కిరోసిన్‌ను గ్రామస్తుల సమాచారంతో విజిలెన్స్, రెవెన్యూ అధికారులు వచ్చి సీజ్ చేసి, తరలించిన సంఘటన శనివారం మండల కేంద్రంలో జరిగింది. అధికారుల కథనం ప్రకారం.. గ్రామంలోని బొప్పిశెట్టి శంకర్ ఇంట్లో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉన్నట్లు సమాచారం అందడంతో జిల్లా ధాన్యం కొనుగోలు అధికారి సంపత్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సివిల్ సప్లయ్ విజిలెన్స్ బృందం ఆ ఇంటిని సోదా చేసి 82.5 క్వింటాళ్ల రేషన్ బియ్యం, 3 క్వింటాళ్ల చక్కెర, 80 లీటర్ల కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇంటి యాజమానిపై కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.
సరుకులను దగ్గర్లోని రైస్‌మిల్లుకు తరలించారు. అనంతరం గ్రామంలోని షాపు నెం.8ను తనిఖీ చేసి పలురికార్డులను పరిశీలించారు. ఇదిలా ఉండగా ఒకేసారి పెద్దమొత్తంలో అక్రమంగా సరుకులు నిల్వ ఉండటం చూసి గ్రామస్తులు నివ్వెరపోయారు. ఇదిలా ఉండగా చుట్టుపక్కల గ్రామాల్లోని వ్యక్తుల వద్ద నిత్యావసర సరుకులు కొనుగోలుచేసినట్లు ఇంటియజమాని అధికారులకు తెలిపా డు. దీంతో తరిగొప్పుల కేంద్రంగా రీసైక్లింగ్ వ్యాపారం జోరుగా సాగుతుందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ సోదాల్లో ఏఎస్‌ఓ రోజారాణి, సివిల్ సప్లయ్ డీటీ సురేష్, రేణుక, తహసీల్దార్ దేవరాయ నర్సయ్య, ఆర్‌ఐ మనోహర్, వీఆర్వో సాయిలు, అంజయ్య ఉన్నారు.
రైస్‌మిల్లుపై విజిలెన్స్ దాడులు
పర్వతగిరి : మండలంలోని రావూర్ గ్రామానికి చెందిన శ్రీవెంకటేశ్వర రైస్‌మిల్లుపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, సివిల్ సప్లై అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. దాడుల్లో 267 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నట్లు విజి లెన్స్ అండ్ ఎన్‌ఫోర్‌సమేంట్ సీఐ చంద్రశేఖర్‌గౌడ్ తెలిపారు. దాడుల్లో సివిల్ సఫ్లై ఏఎస్‌ఓ అనిల్ కుమార్, డీటీలు రాజ్‌కుమార్, రత్నవీరాచారి,హెడ్‌కానిస్టేభుల్ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
200 క్వింటాళ్ల బియ్యం పట్టివేత
సింగరాజుపల్లి(దేవరుప్పుల) : జనగామ-సూర్యాపేట రహదారి సింగరాజుపల్లి వద్ద సివిల్ సప్లయ్ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టగా 200 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. సివిల్ సప్లయ్ జిల్లా పర్యవేక్షణ అధికారి సంపత్‌కుమార్ నేతృత్వంలో మహబూబ్‌బాద్ నుంచి జనగామ వైపు వస్తున్న లారీని తనిఖీ చేయగా 414 బస్తాల్లో ప్యాక్ చే సిన రేషన్ బియ్యాన్ని గుర్తించారు. తదుపరి చర్యల కోసం ఆ బియ్యాన్ని జనగామలోని ఓ రైస్‌మిల్లుకు తరలించారు. దాడుల్లో జనగామ సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్ సురేష్, ఏఎస్‌ఓ రోజారాణి, సిబ్బంది పాల్గొన్నారు. కాగా ఇదే ప్రాంతంలో గత 15 రోజుల క్రితం రేషన్ బియ్యం పట్టుబడడం గమనార్హం.
రేషన్ బియ్యం, చక్కెర, కిరోసిన్ సీజ్
Published Sun, Apr 12 2015 2:09 AM | Last Updated on Sun, Sep 3 2017 12:10 AM
Advertisement
Advertisement