హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలం వెన్నంపల్లిలోని 170 పోలింగ్ కేంద్రంలో రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం శనివారం ఆదేశాలు జారీ చేసింది.
హుస్నాబాద్, న్యూస్‌లైన్ : హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలం వెన్నంపల్లిలోని 170 పోలింగ్ కేంద్రంలో రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం శనివారం ఆదేశాలు జారీ చేసింది. గత నెల 30న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన ఈవీఎంలో 204 ఓట్లు నమోదైన తరువాత ఈవీఎం మొరాయించింది. దీంతో అధికారులు మరో ఈవీఎంను
అక్కడ ఏర్పాటు చేయగా అందులో 210 ఓట్లు పోలయ్యాయి. ఈ పోలింగ్ కేంద్రంలో 471 ఓటర్లు ఉండగా, 414 ఓట్లు పోలయ్యాయి.
ముందుగా ఏర్పాటు చేసిన ఈవీఎంలోని 204 ఓట్లు ఎవరికి పడ్డాయనే విషయం ఈవీఎంలో ఫలితాలు చూపించకపోవచ్చనే భావనకు అధికారులు వచ్చారు. ఈ విషయాన్ని ఎన్నికల సం ఘం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అక్కడ ఈ నెల 13న రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించినట్టు నియోజకవర్గ ఎన్నికల ప్రత్యేకాధి కారి ఎన్.మధసూదన్ తెలిపారు. రీ పోలింగ్‌ను ఎంపీకి మాత్రమే జరుగుతుందని చెప్పారు.