సాక్షి, రంగారెడ్డి జిల్లా: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సందర్భంలో ఈవీఎం పనిచేయని చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందులో భాగంగా కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఒక పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించనున్నారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి ఈ అంశంపై చర్చించారు. అలాంటి సంఘటనలుంటే వెంటనే తనకు నివేదించాలని సూచించారు.
దీంతో జిల్లాలోని కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని 371ఎ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం పనిచేయకపోవడంతో అక్కడ పోలింగ్‌లో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఆ ఒక్క కేంద్రంలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి నివేదించగా అందుకు ఈసీ స్పందిస్తూ ఆమోదముద్ర వేసింది. ఈ కేంద్రంలో ఈ నెల 13న రీపొలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి.శ్రీధర్ పేర్కొన్నారు.
ఒకచోట రీపోలింగ్
Published Sat, May 10 2014 11:32 PM | Last Updated on Wed, Sep 18 2019 2:55 PM
Advertisement
Advertisement