సుల్తానాబాద్ జెండా వందనం చేస్తున్న మెజిస్ట్రేట్
పెద్దపల్లిటౌన్ : పెద్దపల్లి పట్టణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపాలిటీతో పాటు వివిధ ప్రాంతాల్లో మున్సిపల్ చైర్మన్ ఎల్. రాజయ్య, మున్సిపల్ కమిషనర్ జి. శ్రీనివాసన్, మేనేజర్ నయీమ్‌షా ఖాద్రి, సిబ్బంది శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, ఎరుకల రమేశ్, సాబీర్‌ఖాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఆవరణలో చైర్మన్ రఘువీర్‌సింగ్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. శివాలయం కూడలి, చాకలి ఐలమ్మ విగ్రహం, కంచరి బావి వద్ద మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు, సుభాష్‌నగర్ కాంగ్రెస్ కార్యాలయం వద్ద బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు రమేశ్‌గౌడ్ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో ఈర్ల కొమురయ్య, గొట్టిముక్కుల సురేశ్‌రెడ్డి, గీట్ల సవితారెడ్డి, చేతి ధర్మయ్య, ఉప్పు రాజు, సుబ్బారెడ్డి, చొప్పరి సంపత్, మస్రత్, దుర్గారెడ్డి, బొడ్డుపల్లి శ్రీనివాస్, భూతగడ్డ సంపత్, దొడ్డుపల్లి జగదీశ్, తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, మంథని నర్సింగ్, బండారి సునిల్ పాల్గొన్నారు.
పెద్దపల్లిరూరల్ : పెద్దపల్లి కోర్టులో సీనియర్ సివిల్‌జడ్జి పట్టాభిరామారావు జెండా ఆవిష్కరించారు. ఎంపీడివో సత్యనారాయణ, గ్రామీణాభివృద్దిశాఖ పీడీ ప్రేమ్‌కుమార్, డీఎస్‌వో రహమాన్, డీపీవో సుదర్శన్, పశుసంవర్ధకశాఖ జిల్లా అధికారి రాజన్న, తూనికలు, కొలతలశాఖ అధికారి రవీందర్, మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ లతీఫ్, తమ కార్యాలయాల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. మండలంలోని అప్పన్నపేట సింగిల్‌విండో కార్యాలయంపై చైర్మన్ రాజిరెడ్డి, బీజేపి జిల్లా కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి పతాకాన్ని ఆవిష్కరించారు.
కాల్వశ్రీరాంపూర్ : మండల పరిషత్, తహసీల్దార్, సబ్‌స్టేషన్, సింగిల్‌విండో, గ్రామ పంచాయితీ, ఐకేపీ, పోలీస్టేషన్లలో ఎంపీపీ సారయ్యగౌడ్, తహాసీల్దార్ రామ్మోహాన్, ట్రాన్స్‌కో ఏఈ తిరుపతి, సింగిల్‌విండో చైర్మన్ తిరుపతిరెడ్డి, సర్పంచ్ సతీష్, ఏపీఎం పద్మ, ఎస్సై షేక్‌జాన్‌పాషా జెండా ఆవిష్కరించగా, ఆయా గ్రామాల్లో సర్పంచులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. స్థానిక ఎస్సీకాలనీ పాఠశాలలో సర్పంచ్ మాదాసు సతీష్ విద్యార్థులకు 74 ప్లేట్లు అందజేశారు.
సుల్తానాబాద్ : మండల కేంద్రంలోని మున్సిఫ్ కోర్టులో జడ్జి తిరుపతి, మినీ కలెక్టరేట్ కార్యాలయంలో తహసీల్ధార్ రజిత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి మాట్లాడారు. ఎంపీపీ రాజేశ్వరి, సీఐ అడ్లూరి రాములు, సింగిల్ విండో ఛైర్మన్లు శ్రీగిరి శ్రీనివాస్, మోహన్‌రావు, రాజేశ్వర్‌రెడ్డి, అర్జున్‌రావు, సీహెచ్‌ఎంసీలో డాక్టర్ ప్రియాంక ప్రియదర్శిని, ఏఎంసీలో చైర్మన్ కమల, నెహ్రు విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు జాతీయ జెండాను ఆవిష్కరించి మిఠాయిలను పంచారు.
గర్రెపల్లి : గర్రెపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో, ఆదర్శ పాఠశాలలో జరిగిన కార్యక్రమాల్లో రిటైర్డ్ ఉప విద్యాధికారి ఆది సత్యనారాయణరావు పాల్గొన్నారు. బాలికల గురుకుల పాఠశాలలో, సింగిల్‌విండో కార్యాలయంలో, గ్రామపంచాయతీ కార్యాలయాలో సర్పంచుల జెండా ఎగురవేశారు.
ధర్మారం : తహసీల్దార్ కార్యాలయంలో ప్రసాద్, ఎంపీడీవో కార్యాలయంలో రాధ, ఈఆర్‌వో కార్యాలయంలో అకౌంట్స్ ఆఫీసర్ అబ్దుల్ హాఫీజ్, మార్కెట్ కార్యాలయంలో కొత్త నర్సింహం, లయన్స్‌క్లబ్‌లో సామ ఎల్లారెడ్డి, కాంగ్రెస్ కార్యాలయంలో ఆవుల శ్రీనివాస్, టీడీపీ కార్యాలయంలో బద్దం లకుపతిరెడ్డి, టీఆర్‌ఎస్ తుమ్మల రాంబాబు, బీజేపీ తిరుపతిగౌడ్ జాతీయ జెండా ఎగురవేశారు.
ఓదెల : మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గట్టు రమాదేవి జెండా ఆవిష్కరించగా, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎస్సై ఓంకార్, ఎస్సారెస్పీ డీఈఈ నాగభూషణం, ఏవో నాగార్జున, పొత్కపల్లి సింగిల్‌విండో చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, పీహెచ్‌సీలో డాక్టర్ దీప్తి జాతీయ జెండాలను ఎగురవేశారు. ఎంపీడీవో సత్తయ్య, సీఈవో అంజిరెడ్డి, మాజీఎంపీపీ గంట రాములు, టీఆర్‌ఎస్ మండలశాఖ అధ్యక్షుడు వెంకటరెడ్డి, మండల కోఆప్షన్ మెం బర్ సర్వర్, వైస్‌ఎంపీపీ రాజు, బీసీ సంక్షేమ సం ఘం జిల్లా ఉపాధ్యక్షుడు సారయ్య పాల్గొన్నారు.
ఎలిగేడు : మండలంలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా ర్యాలీలను నిర్వహించారు. ఎంపీడీవో సుధాకర్, తహసీల్దార్ సురేశ్, ఎంఈవో కవిత, ఐకేపీ ఏపీఎం గీత, ఎస్‌బీహెచ్ మేనేజర్ అనంతకిషోర్‌నాగ్, ఎలిగేడు, ధూళికట్ట సింగిల్‌విండో చైర్మెన్లు సుధాకర్‌రెడ్డి, సంజీవ్ ఆయా కార్యాలయాలలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఎంపీపీ కవ్వంపల్లి లక్ష్మి, జెడ్పీటీసీ తార పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment