ఫలితాలకు ‘ముందు’జాగ్రత్త | Results 'before' care | Sakshi
Sakshi News home page

ఫలితాలకు ‘ముందు’జాగ్రత్త

Published Thu, May 8 2014 3:48 AM | Last Updated on Sat, Sep 2 2017 7:03 AM

Results 'before' care

  •     ప్రభుత్వ ఏర్పాటుపై టీఆర్‌ఎస్ నేతల ధీమా
  •      రేపు హైదరాబాద్‌లో సమావేశం
  •      హాజరుకానున్న అధినేత కేసీఆర్
  • వరంగల్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తీరుతో జోరుమీదున్న టీఆర్‌ఎస్ ఫలితాలకు ముందే తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు సిద్ధమైంది. తొలి నుంచి ప్రచారంలో ప్రత్యర్థులపై మాటల తూటాలతో దూసుకుపోయిన ఆ పార్టీ కౌం టింగ్‌కు ముందే అభ్యర్థులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే ధీమా ఉన్నందున అవసరమైన వ్యూహం ఖరా రు చేసేందుకు 9వ తేదీన మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసే ఈ ప్రత్యేక సమావేశానికి పార్టీ ముఖ్యనేతలు హాజరవుతున్నా రు. పోటీచేసిన పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులంతా తప్పకుండా రావాలని అధినేత కే.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ఆదేశించారు.  
     
    ఎన్నికలపై సమీక్ష
     
    ఈ సమావేశంలో నియోజకవర్గ స్థాయిలో పోటీచేసిన అభ్యర్థులకు నియోజకవర్గ స్థాయిలో వచ్చిన స్పందన, తొలి నుంచి చేపట్టిన ప్రచారం, పోలింగ్ తీరుతెన్నులు, జరిగిన పొరపాట్లు, పార్టీ వ్యతిరేకులు తదితర అంశాలపై సమీక్షించనున్నట్లు సమాచారం. ప్రతికూల, సానుకూల అంశాలను చర్చించి పార్టీ పరంగా సమీకరించిన సమాచారాన్ని పోల్చి జయపజయాలపై ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

    గెలుపొందే అభ్యర్థులు తక్షణం అందుబాటులో ఉండేవిధంగా సూచించనున్నారు. ప్రభుత్వ ఏర్పాటు తమదేనన్న ధీమాతో ఉన్నందున ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా కలిసికట్టుగా ఉండాలనే అంశాన్ని వివరించనున్నట్లు సమాచారం. ఇక మునిసిపల్, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై ఆధారపడి చైర్మన్ స్థానాలు కైవసం చేసుకునే విధంగా పావులు కదలపాలని సూచిస్తారని భావిస్తున్నారు.

    దీంతో పాటు అధికారంలోకి వస్తే మంత్రివర్గ కూర్పు తదితర అంశాలపై, ముఖ్యంగా దళిత సీఎం అంశం చర్చనీయాం శంగా మారిన నేపథ్యంలో కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలనే అంశం ఈ సమావేశంలో చర్చించి విమర్శలకు తెరదించే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు.

    ఇక ఎంపీ స్థానాలపై ఆధారపడి కేంద్రంలో ఏకూటమితో ముందుకు సాగాలనేది నిర్ణయించే అవకాశం ఉంది. ఏమైనా కౌంటింగ్ రోజు అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలనే అంశాన్ని అధినేత నొక్కిచెప్పనున్నారు. ఇప్పటికే కొందరు పోటీ చేసిన అభ్యర్థులు హైదరాబాద్‌లోనే మకాం వేసినట్లు సమాచారం.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement