రాష్ట్రంలో కందిబోర్డు ఏర్పాటు చేయాలి
సీఎం కేసీఆర్‌కు రేవంత్ లేఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కందుల ఉత్పత్తి పెరుగుతున్న నేపథ్యంలో కందుల అభివృద్ధి బోర్డు ఏర్పా టు చేయాలని సీఎం కేసీఆర్‌ను టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కోరారు. ఈమేరకు మంగళవారం సీఎంకు లేఖ రాశారు. క్వింటాలు కందులకు 10 వేలకు పైగా ఇచ్చి కొంటామని, ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈ ఏడాది 5లక్షల టన్నుల కుపైగా కందులు మార్కెట్‌కు వస్తున్నాయ న్నారు.
కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు లక్ష క్వింటాళ్లు కూడా కొనుగోలు చేయలేదన్నారు. క్వింటాలుకు రూ.450 బోనస్ ఇవ్వాలన్నారు. కాగా, టైగర్ రిజర్వుప్రాజెక్టు పరిధిలో యురేని యం తవ్వకాలను ఆమోదించడానికి వ్యతి రేకంగా నాగర్‌కర్నూలు జిల్లా ఆమ్రాబా ద్‌లో బుధవారం టీటీడీపీ బహిరంగసభ నిర్వహిస్తోంది.