పరిగిలో దొంగల హల్‌చల్!
- రంగారెడ్డి జిల్లాలో పోలీసులపై కాల్పుల కు యత్నం
- ముగ్గురిని పట్టుకున్న పోలీసులు.. మరో వ్యక్తి పరారీ
- ఓ ట్రైనీ ఎస్‌ఐతోపాటు దొంగకూ గాయాలు
- రివాల్వర్‌తో పాటు ఇతర ఆయుధాలు స్వాధీనం
పరిగి : అంతర్రాష్ట్ర ముఠాగా అనుమానిస్తున్న దొంగలు రంగారెడ్డి జిల్లా పరిగిలో అర్ధరాత్రి హల్‌చల్ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి పరిగి గంజ్‌రోడ్డులోని ఎస్‌బీహెచ్ వైపు కారులో వెళ్తున్న అనుమానితులను గస్తీలో ఉన్న పరిగి పోలీసులు అడ్డగించటంతో వారిపై తమ వద్ద ఉన్న రివాల్వర్‌తో కాల్పులు జరిపేందుకు యత్నిం చారు. దీంతో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేయగా, మరో వ్యక్తి పరారయ్యాడు. రంగారెడ్డి జిల్లా పరిగి ఠాణాలో ట్రైనీ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న ఓబుల్‌రెడ్డి మరో ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి శుక్రవారం రాత్రి గస్తీ తిరుగుతున్నాడు.
రాత్రి 2-30 గంటల ప్రాంతంలో గాంధీచౌక్ వైపు నుంచి మెరుున్ రోడ్ వైపు జీపులో వస్తున్న వారికి గంజ్‌రోడ్డులో ఎస్‌బీహెచ్ వైపు వస్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు అడ్డం వచ్చింది. దానికి కర్ణాటక పాసింగ్ ఉండటంతో అనుమానించిన పోలీసులు కిందకు దిగి దానిని ఆపే ప్రయత్నం చేశారు. వారు కారును ఆపినట్లే ఆపి.. మరో దారి గుండా కోర్టువైపుగా వేగంగా వెళ్లారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు కోర్టు ఎదుట ఆ వాహనానికి అడ్డంగా నిల్చున్నారు. ఎదురుగా వచ్చిన అనుమానిత కారు వెళ్లేందుకు వేరే దారి లేకపోవడంతో దుండగులు కారును అక్కడే ఆపారు. ఆ కారు దగ్గరకు వెళ్లిన ట్రైనీ ఎస్‌ఐ ఓబుల్‌రెడ్డి కారులోంచి దిగి కాగితాలు చూపాలని అడిగాడు.
వారు కారు అద్దాలు దించకుండా అలాగే కాసేపు మొండికేశారు. ఎస్‌ఐ గద్దించటంతో కారులోంచి దిగుతూనే తన వద్ద ఉన్న రివాల్వర్‌ను తీసి కాల్చేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన ఓబుల్‌రెడ్డి, మరో ఇద్దరు కాని స్టేబుళ్లు అతను రివాల్వర్ పేల్చకుండా చేతులు గట్టిగా పట్టుకున్నారు. దీంతో వారు కింద పడిపోయారు. ఈ క్రమంలో ఎస్‌ఐతోపాటు ఓ దొంగకు గాయాలయ్యారుు. విడిపించుకునేందుకు ఓ దొంగ ఎస్‌ఐ చేతిని బలంగా కొరికాడు. అరుునా వదలకుండా కానిస్టేబుళ్ల సాయంతో ముగ్గురినీ పట్టుకున్నారు. ఇంతలో ఓ దొంగ పరారయ్యాడు. వెంటనే వారు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న సీఐ ప్రసాద్, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు దొరికిన వారిని పరిగి ఠాణాకు తరలించారు.
చిక్కినట్టే చిక్కి..
పారిపోరుున దొంగ కోసం టీములుగా ఏర్పడి గాలించారు. సీఐ ప్రసాద్ గాలిస్తుండగా పరిగి మండల పరిధిలోని హనుమాన్ గండి తండా సమీపంలో చిక్కినట్లే చిక్కి మళ్లీ తప్పించుకుని పారిపోయాడు. శనివారం మధ్యాహ్నం గాలించినా ప్రయోజనం లేకపోరుుంది. దొరికినవారిలో ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నారు. గాయాల పాలైన దొంగకు పరిగి ఆస్పత్రిలో చికిత్స చేరుుంచి అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పరిగికి చేరుకున్న ఎస్పీ నవీన్ కుమార్, చేవెళ్ల డీఎస్పీ శృతకీర్తి పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు సైతం పరిగికి చేరుకుని ఇటీవల జరిగిన మొరుునాబాద్ మండలంలోని బ్యాంకు దోపిడీకి యత్నించిన ముఠా సభ్యులు వీరేనా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. పరిగి సర్కిల్ పోలీసులతో పాటు వికారాబాద్, చేవెళ్ల, మోరుునాబాద్ తదితర ఠాణాల పోలీసులు పరిగిలో మకాం వేశారు. పట్టుబడిన దొంగలు కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన వారై ఉండవచ్చని ఎస్పీ నవీన్ కుమార్ తెలిపారు. వీరి నుంచి రివాల్వర్, దోపిడీకి వినియోగించే పరికరాలు వారి నుంచి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దీనిపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నామని తెలిపారు. వారిని దొంగల ముఠాగానే పోలీసులు భావిస్తుండగా.. తాము హైదరాబాద్‌కు ఓ పనిపై వెళుతున్నామని ముఠా సభ్యులు చెబుతున్నట్లు తెలిసింది.