Inter-state gang
-
అక్రమ ఆయుధాల సుపారీ గ్యాంగ్ అరెస్ట్
సాక్షి, అమరావతి: అక్రమ ఆయుధాల తయారీ, విక్రయాలతోపాటు నకిలీ నోట్ల దందా నిర్వహిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ముఠా అనంతపురం, బళ్లారి కేంద్రాలుగా వివిధ రాష్ట్రాల్లో కిరాయి హత్యలకు పాల్పడుతూ, నకిలీ నోట్ల ముద్రణ, చలామణి చేస్తున్నట్టు గుర్తించారు. ఈ గ్యాంగ్‌కు చెందిన ఆరుగురు సభ్యులను అరెస్ట్ చేయడంతోపాటు వారి నుంచి 18 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి సోమవారం వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. తీగ లాగితే.. అనంతపురం జిల్లాలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న కొందర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. అంతర్ రాష్ట్ర అక్రమ ఆయుధాల ముఠా వ్యవహారం బయటపడింది. దాంతో అనంతపురం జిల్లా పోలీసులతో స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ ఏర్పాటు చేసి లోతుగా దర్యాప్తు చేపట్టారు. బెంగళూరుకు చెందిన రౌడీషీటర్లు జంషీద్, ముబారక్, అమీర్ పాషా, రియల్ అబ్దుల్ షేక్ మహారాష్ట్రలోని సిర్పూర్ నుంచి గంజాయి, మధ్యప్రదేశ్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ వారిని అరెస్ట్ చేసి 12 అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్ టీమ్ వారిని విచారించి మరింత కీలక సమాచారాన్ని రాబట్టింది. అనంతరం మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లాలో హిరేహాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ ఆయుధాల తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించింది. ఆయుధాల తయారీదారుడు, డీలర్ రాజ్‌పాల్‌సింగ్‌తోపాటు ఆయుధాల సరఫరాదారుడిగా ఉన్న సుతార్‌ను అరెస్ట్ చేశారు. వారి నుంచి 6 అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆయుధాల డీలర్ల నుంచి కొనుగోలు చేసిన ఆయుధాలతో బెంగళూరుకు చెందిన ముఠా సభ్యులు కర్ణాటకలో వివిధ ప్రాంతాల్లో హత్యలు, దోపిడీలకు పాల్పడుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రాజ్‌పాల్‌సింగ్ దేశంలోని వందలాది ప్రాంతాలకు అక్రమ ఆయుధాలు సరఫరా చేస్తున్నట్టు కూడా బయటపడింది. నిందితులు ఆరుగురిపై గంజాయి అక్రమ రవాణా, నకిలీ నోట్ల రాకెట్, అక్రమ ఆయుధాలు, కిరాయి హత్యలు తదితర అభియోగాలపై ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవాలలో పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ముఠా నెట్‌వర్క్‌పై మరిన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అసాంఘిక శక్తులను ఉపేక్షించేదే లేదు సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాం. ఈ క్రమంలో అనంతపురం జిల్లా పోలీసులు కీలక కేసును ఛేదించారు. బెంగళూరుకు చెందిన కిరాయి హంతకుల ముఠా అనంతపురం–బళ్లారి కేంద్రాలుగా కొంతకాలంగా నకిలీ నోట్లు, అక్రమ ఆయుధాల దందా నిర్వహిస్తున్నట్టు గుర్తించాం. అక్రమ ఆయుధాల తయారీదారు, డీలర్‌తోపాటు అంతర్ రాష్ట్ర ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్ట్ చేసి 18 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం. – కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, డీజీపీ -
అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
హైదరాబాద్: తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గేట్‌గా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన సల్మాన్ గ్యాంగ్ సభ్యులను పోలీసులు అరెస్ట్‌చేశారు. నగరంలోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడిన సల్మాన్ గ్యాంగ్‌కు చెందిన నలుగురు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు బేగంపేట ఏసీపీ రంగారావు తెలిపారు. గ్యాంగ్‌కు చెందిన లక్ష్మణ్, ఫక్రుద్దీన్, అవినాష్, జావిద్‌లను అరెస్ట్ చేశామని పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. -
ఫేక్ కరెన్సీ ఫ్రం వెస్ట్ బెంగాల్
పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా ప్రాంతం నుంచి నకిలీ కరెన్సీని తీసుకువచ్చి హైదరాబాద్‌లో చెలామణి చేయడానికి యత్నించిన అంతరాష్ట్ర ముఠాను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు బెంగాలీలతో సహా ముగ్గురిని అరెస్టు చేశామని, వీరి నుంచి రూ.11.95 లక్షలు స్వాధీనం చేసుకున్నామని అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి శుక్రవారం వెల్లడించారు. టాస్క్‌ఫోర్స్, చార్మినార్ ఇన్స్పెక్టర్లు ఎ.యాదగరి, కె.చంద్రశేఖర్‌రెడ్డిలతో కలిసి పాతబస్తీలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్వాపరాలు వెల్లడించారు. గౌస్ దందానే నకిలీ కరెన్సీ... చంద్రాయణగుట్ట ఠాణా పరిధిలోని బండ్లగూడకు చెందిన మహ్మద్ గౌస్ అనే పండ్ల వ్యాపారి తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం కొన్నేళ్ళుగా నకిలీ కరెన్సీ దందా ప్రారంభించాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అనేక మంది ఏజెంట్లతో ఒప్పందాలు కుదుర్చుకున్న ఇతడు అక్కడ నుంచి నకిలీ కరెన్సీని వివిధ మార్గాల్లో నగరానికి రప్పించి చెలామణి చేసేవాడు. అలా వచ్చిన మొత్తం నుంచి ఏజెంట్ల వాటాను వారికి పంపేవాడు. ఈ తరహాలో దందా చేస్తూ ఇప్పటికే మోండా మార్కెట్, గోపాలపురం, కంచన్‌బాగ్, గోపాలపురం, శాలిబండ, కాలాపత్తర్, భవానీనగర్, చంద్రాయణగుట్ట, మీర్‌చౌక్, ఫలక్‌నుమ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్ళాడు. కుటుంబీకులతో కలిసే మార్పిడి... జైలుకు వెళ్ళి బెయిల్‌పై వచ్చిన ప్రతిసారీ పోలీసు నిఘా నుంచి తప్పించుకోవడానికి తన చిరునామా మార్చేసే గౌస్ ప్రస్తుతం బండ్లగూడ మహ్మద్‌నగర్‌లో నివసిస్తున్నాడు. అనేక సందర్భాల్లో తన కుటుంబీకులతోనూ కలిసి నకిలీ కరెన్సీ మార్పిడి చేసే ఇతగాడికి ఇటీవల పశ్చిమ బెంగాల్‌లోని బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లా మాల్దాలో ఉన్న కాలియా చౌక్ ప్రాంతానికి చెందిన బబ్లూ షేక్ అలియాస్ బబ్లూతో పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం నడుస్తున్న గణేష్ ఉత్సవాలు, త్వరలో రానున్న బక్రీద్ పండుగ నేపథ్యంలో రద్దీగా ఉండే వాణిజ్య ప్రాంతాల్లో వ్యాపారం జోరుగా ఉంటుందని, దీంతో నకిలీ కరెన్సీ తేలిగ్గా మార్చేందుకు అవకాశం ఉంటుందని భావించాడు. బబ్లూను సంప్రదించిన గౌస్ రూ.12 లక్షల నకిలీ కరెన్సీ పంపాలని, మార్పిడి తర్వాత రూ.6 లక్షల అసలు కరెన్సీ పంపిస్తానంటూ ఒప్పందం కుదుర్చుకున్నాడు. బంధువులకు ఇచ్చి పంపిన బబ్లూ... దీనికి అంగీకరించిన బబ్లూ రూ.1000, రూ.500 డినామినేషన్లో ఉన్న రూ.12 లక్షల నకిలీ కరెన్సీని గౌస్‌కు పంపాలని నిర్ణయించుకున్నాడు. తన తల్లి జహనారా బీబీ, బావమరిది షరీఫుల్ షేక్‌కు ఈ మొత్తాన్ని ఇచ్చిన బబ్లూ వారిని రైలులో హైదరాబాద్‌కు పంపాడు. వీరిద్దరికీ గౌస్ ఫోన్ నెంబర్ ఇచ్చి నగరానికి చేరుకున్నాక సంప్రదించి నగదు అందించమని చెప్పాడు. దీంతో ఇరువురూ శుక్రవారం సిటీకి చేరుకుని గౌస్‌ను సంప్రదించారు. అతడు చెప్పిన ప్రకారం చార్మినార్ ప్రాంతంలో నకిలీ కరెన్సీ అందించడానికి సిద్ధమయ్యారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎ.యాదగిరి నేతత్వంలో ఎస్సైలు ఎన్.శ్రీశైలం, బి.మధుసూదన్, జి.మల్లేష్ తమ బందాలతో వలపన్ని ముగ్గురినీ అరెస్టు చేశారు. ప్రయాణం నేపథ్యంలో జహనారా బీబీ, షరీఫుల్లు రూ.5 వేలు ఖర్చు చేయగా... మిగిలిన రూ.11.95 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును చార్మినార్ పోలీసులకు అప్పగించారు. -
పరిగిలో దొంగల హల్చల్!
- రంగారెడ్డి జిల్లాలో పోలీసులపై కాల్పుల కు యత్నం - ముగ్గురిని పట్టుకున్న పోలీసులు.. మరో వ్యక్తి పరారీ - ఓ ట్రైనీ ఎస్ఐతోపాటు దొంగకూ గాయాలు - రివాల్వర్‌తో పాటు ఇతర ఆయుధాలు స్వాధీనం పరిగి : అంతర్రాష్ట్ర ముఠాగా అనుమానిస్తున్న దొంగలు రంగారెడ్డి జిల్లా పరిగిలో అర్ధరాత్రి హల్చల్ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి పరిగి గంజ్రోడ్డులోని ఎస్బీహెచ్ వైపు కారులో వెళ్తున్న అనుమానితులను గస్తీలో ఉన్న పరిగి పోలీసులు అడ్డగించటంతో వారిపై తమ వద్ద ఉన్న రివాల్వర్‌తో కాల్పులు జరిపేందుకు యత్నిం చారు. దీంతో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేయగా, మరో వ్యక్తి పరారయ్యాడు. రంగారెడ్డి జిల్లా పరిగి ఠాణాలో ట్రైనీ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఓబుల్‌రెడ్డి మరో ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి శుక్రవారం రాత్రి గస్తీ తిరుగుతున్నాడు. రాత్రి 2-30 గంటల ప్రాంతంలో గాంధీచౌక్ వైపు నుంచి మెరుున్ రోడ్ వైపు జీపులో వస్తున్న వారికి గంజ్‌రోడ్డులో ఎస్బీహెచ్ వైపు వస్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు అడ్డం వచ్చింది. దానికి కర్ణాటక పాసింగ్ ఉండటంతో అనుమానించిన పోలీసులు కిందకు దిగి దానిని ఆపే ప్రయత్నం చేశారు. వారు కారును ఆపినట్లే ఆపి.. మరో దారి గుండా కోర్టువైపుగా వేగంగా వెళ్లారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు కోర్టు ఎదుట ఆ వాహనానికి అడ్డంగా నిల్చున్నారు. ఎదురుగా వచ్చిన అనుమానిత కారు వెళ్లేందుకు వేరే దారి లేకపోవడంతో దుండగులు కారును అక్కడే ఆపారు. ఆ కారు దగ్గరకు వెళ్లిన ట్రైనీ ఎస్ఐ ఓబుల్‌రెడ్డి కారులోంచి దిగి కాగితాలు చూపాలని అడిగాడు. వారు కారు అద్దాలు దించకుండా అలాగే కాసేపు మొండికేశారు. ఎస్ఐ గద్దించటంతో కారులోంచి దిగుతూనే తన వద్ద ఉన్న రివాల్వర్‌ను తీసి కాల్చేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన ఓబుల్‌రెడ్డి, మరో ఇద్దరు కాని స్టేబుళ్లు అతను రివాల్వర్ పేల్చకుండా చేతులు గట్టిగా పట్టుకున్నారు. దీంతో వారు కింద పడిపోయారు. ఈ క్రమంలో ఎస్ఐతోపాటు ఓ దొంగకు గాయాలయ్యారుు. విడిపించుకునేందుకు ఓ దొంగ ఎస్ఐ చేతిని బలంగా కొరికాడు. అరుునా వదలకుండా కానిస్టేబుళ్ల సాయంతో ముగ్గురినీ పట్టుకున్నారు. ఇంతలో ఓ దొంగ పరారయ్యాడు. వెంటనే వారు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న సీఐ ప్రసాద్, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు దొరికిన వారిని పరిగి ఠాణాకు తరలించారు. చిక్కినట్టే చిక్కి.. పారిపోరుున దొంగ కోసం టీములుగా ఏర్పడి గాలించారు. సీఐ ప్రసాద్ గాలిస్తుండగా పరిగి మండల పరిధిలోని హనుమాన్ గండి తండా సమీపంలో చిక్కినట్లే చిక్కి మళ్లీ తప్పించుకుని పారిపోయాడు. శనివారం మధ్యాహ్నం గాలించినా ప్రయోజనం లేకపోరుుంది. దొరికినవారిలో ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నారు. గాయాల పాలైన దొంగకు పరిగి ఆస్పత్రిలో చికిత్స చేరుుంచి అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పరిగికి చేరుకున్న ఎస్పీ నవీన్ కుమార్, చేవెళ్ల డీఎస్పీ శృతకీర్తి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు సైతం పరిగికి చేరుకుని ఇటీవల జరిగిన మొరుునాబాద్ మండలంలోని బ్యాంకు దోపిడీకి యత్నించిన ముఠా సభ్యులు వీరేనా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. పరిగి సర్కిల్ పోలీసులతో పాటు వికారాబాద్, చేవెళ్ల, మోరుునాబాద్ తదితర ఠాణాల పోలీసులు పరిగిలో మకాం వేశారు. పట్టుబడిన దొంగలు కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన వారై ఉండవచ్చని ఎస్పీ నవీన్ కుమార్ తెలిపారు. వీరి నుంచి రివాల్వర్, దోపిడీకి వినియోగించే పరికరాలు వారి నుంచి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దీనిపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నామని తెలిపారు. వారిని దొంగల ముఠాగానే పోలీసులు భావిస్తుండగా.. తాము హైదరాబాద్‌కు ఓ పనిపై వెళుతున్నామని ముఠా సభ్యులు చెబుతున్నట్లు తెలిసింది. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
విజయనగరం క్రైం: జిల్లా కేంద్రంలో దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు సీసీఎస్ డీఎస్పీ ఎ.ఎస్.చక్రవర్తి తెలిపారు. శుక్రవారం స్థానిక సీసీఎస్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విజయనగరం పట్టణం టూటౌన్ పరిధిలోని పీఎస్ఆర్కాలనీలో దొంగతనానికి పాల్పడిన ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన హుస్సేన్ రస్టీఆలీ, పర్వేజ్ ఆలీ, మహ్మద్ ఆన్వర్, జావేద్ ఆలీ, లకేశ్వర్ సాహులను శుక్రవారం ఉదయం ఆరు గంటలకు స్వామి రియల్ ఎస్టేట్ దగ్గర మాటు వేసి పట్టుకున్నామన్నారు. వీరి నుంచి సుమారు ఏడు తులాల బంగారు అభరణాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. దొంగలను పట్టుకోవడంలో కీలకపాత్ర వహించిన విజయనగరం టూటౌన్ సీఐ జి.డి.ప్రసాద్, సీసీఎస్ ఎస్సై ఎస్.ఎస్.నాయుడు, కె.ఎస్.కె.ఎన్.జి.ఎ.ప్రసాద్, ఎస్.జియాద్దీన్, హెచ్‌సీ జి.మహేష్, పి.జె.మోహన్, డి.శంకరరావు, నాగేంద్ర, బి.కాశీరాజు, వి.శేఖర్‌లను అభినందించారు. -
అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
నిజామాబాద్ క్రైం: తెలంగాణ, మహారాష్ట్రలలో దొంగతనాలు, దారి దోపిడీలు, అత్యాచారాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను నిజామాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మొత్తం 9 మంది ముఠా సభ్యులలో పోలీసుల చేతికి ముగ్గురు చిక్కగా, ఆరుగురు పరారీలో ఉన్నారు. అరెస్టు అయిన దొంగల నుంచి బంగారు అభరణాలు, వెండి వస్తువులు, నగదు, చాకులు, ఓ కారు, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం డీఐజీ గంగాధర్ , జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. నిజామాబాద్, మెదక్ జిల్లాలతో పాటు మహారాష్ట్రలో వివిధ ప్రాంతాలలో తాళం వేసున్న ఇళ్లలో చోరీకి పాల్పడడంతో పాటు ఇతర ప్రాంతాలలో మారణాయుధాలు చూపి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి నగలు, డబ్బు లాక్కునేవారు. మొత్తం తొమ్మిది మంది ముఠాగా ఏర్పడి ఇలా అరాచకాలు చేసేవారు. గురువారం ఉదయం రూరల్ పోలీసులు కంఠేశ్వర్ ప్రాంతం బైపాస్‌రోడ్డు, రైల్వేస్టేషన్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా బైపాస్ వద్ద ఈ ముఠాలోని ముగ్గురిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో మహారాష్ట్ర నాందేడ్ జిల్లా దెగ్లూర్ తాలుకా పాతా ఖానాపూర్‌కు చెందిన దండ్ల బాబు, అర్దాపూర్కు చెందిన లక్ష్మన్ పీరాజీ మిత్కర్, బీడ్ పట్టణం ధనోరాకు చెందిన జోగుదండి వికాస్ ఉన్నారు. వారి నుంచి 27 తులాల బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి వస్తువులు, రూ. 50 వేల నగదు, ఒక మారుతి కారు, మూడు బైక్‌లు, మూడు చాక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాపై మొత్తం 19 కేసులు ఉన్నాయి.