జిల్లా కేంద్రంలో దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు సీసీఎస్ డీఎస్పీ
విజయనగరం క్రైం: జిల్లా కేంద్రంలో దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు సీసీఎస్ డీఎస్పీ ఎ.ఎస్.చక్రవర్తి తెలిపారు. శుక్రవారం స్థానిక సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విజయనగరం పట్టణం టూటౌన్ పరిధిలోని పీఎస్‌ఆర్‌కాలనీలో దొంగతనానికి పాల్పడిన ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన హుస్సేన్ రస్టీఆలీ, పర్వేజ్ ఆలీ, మహ్మద్ ఆన్వర్, జావేద్ ఆలీ, లకేశ్వర్ సాహులను శుక్రవారం ఉదయం ఆరు గంటలకు స్వామి రియల్ ఎస్టేట్ దగ్గర మాటు వేసి పట్టుకున్నామన్నారు.
వీరి నుంచి సుమారు ఏడు తులాల బంగారు అభరణాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. దొంగలను పట్టుకోవడంలో కీలకపాత్ర వహించిన విజయనగరం టూటౌన్ సీఐ జి.డి.ప్రసాద్, సీసీఎస్ ఎస్సై ఎస్.ఎస్.నాయుడు, కె.ఎస్.కె.ఎన్.జి.ఎ.ప్రసాద్, ఎస్.జియాద్దీన్, హెచ్‌సీ జి.మహేష్, పి.జె.మోహన్, డి.శంకరరావు, నాగేంద్ర, బి.కాశీరాజు, వి.శేఖర్‌లను అభినందించారు.