ఉపాధి పనుల్లో లక్షలు స్వాహా | rs.19.80lakhs fraud in national rural employment guarantee program | Sakshi
Sakshi News home page

ఉపాధి పనుల్లో లక్షలు స్వాహా

Published Sat, Apr 11 2015 5:00 PM | Last Updated on Sun, Sep 3 2017 12:10 AM

rs.19.80lakhs fraud in national rural employment guarantee program

కోటిపల్లి : ఆదిలాబాద్ జిల్లా కోటిపల్లి మండలం పరిధిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు చేయకపోయినా, చేసినట్టు రికార్డులో చూపించి రూ.19.80 లక్షల మేర నిధుల స్వాహా చేసినట్టు బయటపడింది. వివరాల ప్రకారం.. శనివారం కోటిపల్లి  మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి హామీ అటవీ పనుల్లో సిబ్బంది అవినీతికి పాల్పడినట్టు రుజువు కావడంతో డ్వామా పీడీ శ్రీనివాస్ విచారణకు ఆదేశించారు. ఈ అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని డివిజనల్ అటవీ అధికారికి సిఫారసు చేస్తానని తెలిపారు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement