ఆర్టీసీ ప్రమాద మృతులకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియో
ఖమ్మం: ఆర్టీసీ బస్సు ప్రమాద మృతులకు రూ. 2లక్షల ఎక్స్గ్రేషియోను ప్రకటించినట్టు తెలంగాణ మంత్రులు మహేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గురువారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు బ్రిడ్జి పై నుంచి నదిలో పడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో 30మంది తీవ్రంగా గాయపడ్డారు.
భద్రాలచం డిపోకు చెందిన (AP 20 3940) ఆర్టీసీ రామబాణం బస్సు ఖమ్మం నుంచి భద్రాచలం వస్తుండగా బ్రిడ్జి పైకి వెళుతున్న సమయంలో ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానికులు వెంటనే స్పందించి నదిలో పడిపోయిన వారిని రక్షించారు. క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు.