నాగర్‌కర్నూలు: జీవితంపై విరక్తితో ఆర్టీసీ బస్ కండక్టర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూలు బస్టాండ్‌లో శనివారం మధ్యాహ్నం జరిగింది. నాగర్‌కర్నూల్ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న డి.బాలస్వామి అర్హతలేని ప్రయాణికుడికి హాఫ్ టికెట్ ఇచ్చాడన్న ఆరోపణపై జనవరిలో సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఇన్‌చార్జ్ డీఎం విజయబాబు వద్దకు రోజూ వెళ్లి తన కేసు త్వరగా తేల్చమని విన్నవించుకున్నా ఆయన సరిగా స్పందించకపోవడంతో మనస్తాపానికి గురైన బాలస్వామి శనివారం మధ్యాహ్నం నాగర్‌కర్నూల్ ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లి ఎలుకలమందు సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఇది గమనించిన ఆర్టీసీ సిబ్బంది వెంటనే అతనిని ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారు. నాలుగు నెలలుగా ఉద్యోగం లేకపోవడంతో కుటుంబపోషణ కష్టమై, కేసు త్వరగా తేల్చమని విచారణాధికారిని రోజూ విన్నవిస్తున్నా ఆయన కనికరించకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు యత్నించినట్లు ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు.
బస్టాండ్‌లో ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్యాయత్నం
Published Sat, May 2 2015 3:16 PM | Last Updated on Sun, Sep 3 2017 1:18 AM
Advertisement