rtc bus conductor
-
కండక్టర్లు మర్యాదగా మెలగాలి: సజ్జనార్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులతో బస్సు కండక్టర్లు మర్యాదగా మెలగాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశించారు. సంస్థకు డ్రైవర్లు, కండక్టర్లే బ్రాండ్ అంబాసిడర్లన్న విషయాన్ని గుర్తించాలని ఆయన సూచించారు. బస్‌భవన్ నుంచి వర్చువల్ పద్ధతిలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో టీఎస్ఆర్టీసీ ఏప్రిల్ చాలెంజ్ ఫర్ట్రైనింగ్ పేరుతో కండక్టర్లకు శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు కండక్టర్లతో ఆయన మాట్లాడారు. ప్రయాణికులను బస్సుల్లోకి సాదరంగా ఆహ్వానించాలని, గౌరవంగా సంబోధించాలని సూచించారు. ఆక్యుపెన్సీ రేషియోను 75 శాతానికి చేర్చాలనే సంస్థ లక్ష్యానికి కండక్టర్లు సహకారం అందించాలన్నారు. హైకోర్టుకు కొత్తగా ఆరుగురు జీపీలు సాక్షి, హైదరాబాద్: హైకోర్టుకు కొత్తగా జీపీ లు, ఏజీపీల నియామకం చేపడుతూ అడ్వొకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సల్వాజి రాజశేఖర్‌రావు, కె.సుధాకర్‌రెడ్డి, ఆర్.మన్మద్‌రెడ్డి, కొండపర్తి శ్రీనివాస్, ఎల్.సు«దీర్, కె.ప్రవీణ్‌కుమార్‌ను ప్రభుత్వ న్యాయవాదులుగా నియమించారు. మరో 31 మందిని అసిస్టెంట్ జీపీలుగా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
బస్సులో... లవ్.. కామెడీ
-
బస్టాండ్‌లో ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్యాయత్నం
నాగర్‌కర్నూలు: జీవితంపై విరక్తితో ఆర్టీసీ బస్ కండక్టర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూలు బస్టాండ్‌లో శనివారం మధ్యాహ్నం జరిగింది. నాగర్‌కర్నూల్ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న డి.బాలస్వామి అర్హతలేని ప్రయాణికుడికి హాఫ్ టికెట్ ఇచ్చాడన్న ఆరోపణపై జనవరిలో సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఇన్చార్జ్ డీఎం విజయబాబు వద్దకు రోజూ వెళ్లి తన కేసు త్వరగా తేల్చమని విన్నవించుకున్నా ఆయన సరిగా స్పందించకపోవడంతో మనస్తాపానికి గురైన బాలస్వామి శనివారం మధ్యాహ్నం నాగర్‌కర్నూల్ ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లి ఎలుకలమందు సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన ఆర్టీసీ సిబ్బంది వెంటనే అతనిని ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారు. నాలుగు నెలలుగా ఉద్యోగం లేకపోవడంతో కుటుంబపోషణ కష్టమై, కేసు త్వరగా తేల్చమని విచారణాధికారిని రోజూ విన్నవిస్తున్నా ఆయన కనికరించకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు యత్నించినట్లు ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు.