దిలావర్‌పూర్: మాట్లాడుతున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
దిలావర్‌పూర్(నిర్మల్) : సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం రైతులకు గొప్ప వరంలాంటిదని రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండలంలోని గుండంపల్లిలో శుక్రవారం ఏర్పాటు చేసిన రైతుబంధు చెక్కులు, పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యావత్‌భారత దేశంలో అనేక రాష్ట్రాలు తెలం గాణ పథకాలవైపు చూస్తున్నాయని ఈఘనత రాష్ట్ర సర్కారుదేన్నారు. ఎన్నో ఏళ్ళుగా రైతులు కష్టించి వ్యవసాయం చేస్తున్నా అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోక పోవడంవల్లే రైతుఆత్మహత్యలు పెరిగిపోయాయన్నారు.
నేడు ఆపరిస్థితి రాకుండా రైతులకు పంటల సాగులో ఆదినుంచి వెన్నుదన్నుగా నిలిచేందుకు రాష్ట్ర సర్కారు బాసటగా నిలుస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాజెక్టుపూర్తయితే నిర్మల్‌జిల్లాలోని 50వేల ఎకరాలకు సాగునీరు అంది బీడుభూములన్నీ సస్యశ్యామలం అవుతాయన్నారు. గుండంపల్లిలో వేంకటేశ్వరస్వామి ఆలయానికి రూ.36లక్షలు, బీరప్ప ఆలయానికి రూ.10లక్షలు, భీమన్న ఆలయ నిర్మాణానికి రూ.10లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి వి.సత్యనారాయణగౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, నిర్మల్ ఏఎంసీ చైర్మన్ కె.దేవేందర్‌రెడ్డి, ఎఫ్‌ఎస్‌సీఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు రమణారెడ్డి, ఎంపీపీ పాల్దె లక్ష్మిశ్రీనివాస్, సర్పంచ్ మోర సురేఖ, ఎంపీటీసీ సభ్యురాలు సవితారెడ్డి, రైతులు పాల్గొన్నారు.
అన్నదాతలకు అండగా రైతుబంధు
లక్ష్మణచాంద(నిర్మల్): రాష్ట్రంలోని అన్నదాతలకు అండగా నిలిచేందుకే ప్రభుత్వం రైతుబంధు పథకం ప్రవేశపెట్టిందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పీచరలో రైతుబంధు చెక్కులు, పాస్‌బుక్‌ల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ప్రసునాంభా, ఎఫ్‌ఎస్‌సీఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, ఎంపీపీ కౌసల్య, జెడ్పీటీసి అడ్వాల పద్మ పాల్గొన్నారు.
దేశంలోనే ఆదర్శం
మామడ(నిర్మల్) : వ్యవసాయదారులకు అండగా ఉంటూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండలంలోని పరిమండల్‌లో రైతుబందు పథకంలో భాగంగా నిర్వహించిన పట్టాదారు పాసుపుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూమవ్వ, ఎంపీటీసీ అన్వర్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు గంగారెడ్డి పాల్గొన్నారు.
వ్యవసాయరంగం అభివృద్ధి
నిర్మల్‌టౌన్: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టాడని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్‌రూరల్ మండలంలోని న్యూముజ్గిలో శుక్రవారం పెట్టుబడి చెక్కులు, పట్టాదార్ పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రూ. 34.94 లక్షల విలువైన చెక్కులు, 327మంది రైతులకు పట్టాదార్ పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు.
నిర్మల్ మండలంలోని 7409మంది రైతుల 14863 ఎకరాల భూమికి రైతుబంధు పథకం కిం ద రూ.5.94కోట్లు పంపిణీ చేయనున్నట్లు తెలి పారు. రైతు సమన్వయ సమితి కోకన్వీనర్ నల్లా వెంకట్‌రాంరెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, ఎంపీపీ దౌలన్‌బీ, జిల్లా ఎఫ్‌ఏసీఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, సర్పంచ్ గంగవ్వ, తహసీల్దార్ శంకర్, మల్లేశ్, అంజిరెడ్డి, మౌలానా, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment