ఇంకా రాని ‘రైతు బంధు’ | Rythu Bandhu Scheme Money Not Released | Sakshi
Sakshi News home page

ఇంకా రాని ‘రైతు బంధు’

Published Tue, Apr 16 2019 11:21 AM | Last Updated on Tue, Jun 4 2019 5:02 PM

Rythu Bandhu Scheme Money Not Released - Sakshi

మోర్తాడ్‌(బాల్కొండ): రబీ సీజను ముగిసిపోతు న్నా రైతుబంధు నిధులు తమ ఖాతాల్లో జమ కాకపోవడంతో పలువురు రైతులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్‌ సీజను కోసం రైతులు ఏర్పాట్లు చేసుకునే పనిలో ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం రానున్న మే నెలలో వచ్చే ఖరీఫ్‌ సీజను కోసం రైతుబంధు నిధులను విడుదల చేయాల్సి ఉంది. అయితే రబీ సీజనుకు సంబంధిం చి పూర్తి స్థాయిలో నిధులు విడుదల కాకపోవడంతో పెట్టుబడి సహాయం కోసం రైతులకు నిరీక్షణ తప్ప డం లేదు. ముందస్తు శాసనసభ ఎన్నికల కోడ్‌ కారణంగా రబీ సీజను పెట్టుబడి సహాయాన్ని చెక్కుల రూపంలో కాకుండా రైతుల ఖాతాల్లో జమ చేయా లని ఎన్నికల కమిషన్‌ సూచించింది.

దీంతో రైతుల ఖాతాల వివరాలను, ఆధార్‌ నంబర్‌లను వ్యవసాయాధికారులు సేకరించగా ప్రభుత్వం విడతల వారీ గా రైతుబంధు పథకం కింద నిధులను విడుదల చేసింది. ఇందులో భాగంగా జిల్లాలోని 2.48 లక్షల మంది రైతులకు రూ.199 కోట్ల నిధులను విడుదల చేయాల్సి ఉంది. అయితే ఇంత వర కు ప్రభుత్వం రూ.146 కోట్ల నిధులను మాత్రమే విడుదల చేసింది. ఈ లెక్కన 75 శాతం మంది రైతులకు నిధులు ఖాతాల్లోకి చేరాయి. ఇంకా రూ.53 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉంది. ముందస్తు శాసనసభ ఎన్నికలకు ఒక రోజు ముందు కూడా రైతుల ఖా తాల్లోకి నిధులు చేరాయి. ముందస్తు శాసనసభ ఎన్నికలు ముగిసిన తరువాత మా త్రం రైతుబంధు నిలిచిపోయింది.

అయితే తాము సేకరించిన రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశామని ట్రెజరీ కార్యా లయం నుంచి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సహాయం నిధులు జమ అవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నా రు. ఇది ఇలా ఉండగా ట్రెజరీ శాఖకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వకపోవడం వల్లనే రైతుబంధు పథకం కింద రైతులకు పూర్తి స్థాయిలో నిధులు జమ కావడం లేదని వెల్లడవుతోంది. మే నెలలో వచ్చే ఖరీఫ్‌కు సంబంధించిన పెట్టుబడి సహాయం అందించాల్సి ఉంది. కాగా ఇప్పటి వరకు రబీ సీజను పెట్టుబడి సహా యం పూర్తి స్థాయిలో అందించకపోవడం తో ఖరీఫ్‌ పెట్టుబడిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం స్పం దించి రైతుబంధు రబీ పెట్టుబడి సహా యం పూర్తి స్థాయిలో చెల్లించి ఖరీఫ్‌ పెట్టుబడి సహాయంను అందించే విషయంపై స్పష్ట త ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement