సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించే విషయంలో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపాలని విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యా శాఖ ఉన్నతాధికారులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో సోమవారం తన కార్యాలయంలో సమావేశమయ్యారు. స్పౌజ్ కేసులకు సంబంధించి అంతర్ జిల్లా బదిలీల నిర్వహణకు త్వరగా ప్రతిపాదనలు పం పాలని సూచించారు. ప్రస్తుతం ఏడో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు 8 నుంచి 10వ తరగతి వరకు అప్ గ్రేడ్ చేస్తూ అనుమతులు మంజూరు చేసే అధికారాలను జిల్లా విద్యా శాఖాధికారులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ప్రభు త్వ కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డి, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ విజయ్ కుమార్, శాసన మండలి సభ్యుడు జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment