షాదీముబారక్‌పై విచారణ
వర్ధన్నపేట టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన షాదీ ముబారక్ పథకంలో జరిగిన అవకతవకలను గుర్తించేందుకు మండలంలో విచారణ చేపట్టినట్లు ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాసరాజు, సాంబయ్య తెలిపారు. శనివారం మండలంలోని వర్ధన్నపేట, ఇల్లంద, కట్య్రాల, పున్నేలు తదితర గ్రామాల్లో విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలో ఇటీవల వివాహమైన ఎండీ రబ్బానీ, వజీర్, జలాల్ కుటుంబాల ఇళ్లకు వెళ్లి వారికి షాదీముబారక్ పథకానికి సంబంధించి లబ్ధి చేకూరిందా అని వాకబు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన విచారణలో భాగంగా వర్ధన్నపేట మండలంలో పలు గ్రామాల్లో విచారణ చేశామన్నారు. కట్య్రాలలో ఓ కుటుం బంలో పెళ్లికూతురు పేరుపై పథకం రావడంతో ఆ డబ్బును అతడి అల్లుడే తీసుకున్నట్లు గుర్తించమన్నారు. ఈ పథకంలో లబ్ధిదారులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, అలాంటివి ఏమైన జరిగితే తమకు సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. నేరుగా అధికారులను కలిసి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రాయపర్తిలో..
మండలకేంద్రంతోపాటు, మండలంలోని మైలారం గ్రామంలో షాదీముబారక్ లబ్ధిదారులను ఏసీబీ అధికారులు విచారించా రు. లబ్ధిదారులు దళారులతో మోసపోతున్నారనే సమాచారం మేరకు విచారణ చేపట్టినట్లు ఏసీబీ సీఐలు శ్రీనివాసరావు, సాంబయ్య తెలి పారు. మండల కేంద్రంతోపాటు, గ్రామాల్లో 17 మంది షాదీముబారక్ లబ్ధిదారులున్నట్లు తెలిపారు.