'హైదరాబాదీ' సానియా తెలంగాణకు గర్వకారణం: కేసీఆర్
'హైదరాబాదీ' సానియా తెలంగాణకు గర్వకారణం: కేసీఆర్
Published Tue, Jul 22 2014 1:17 PM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM
హైదరాబాద్: ఇప్పటి వరకు టెన్నిస్ క్రీడాకారిణిగా, మోడల్ కనిపించిన సానియా మీర్జా కొత్త పాత్రను పోషించనుంది. రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా సానియా మీర్జాను తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసింది. భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి, ప్రయోజనాలను ప్రమోట్ చేయనుంది.
తెలంగాణ రాష్ట్ర అంబాసిడర్ గా ఎంపిక చేసినట్టు జయేశ్ రంజన్ ధృవీకరించారు. పారిశ్రామిక వేత్తల సమావేశంలో సానియాకు ప్రభుత్వ అధికార దృవ పత్రంతోపాటు కోటి రూపాయల చెక్ ను ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అందించారు.
సానియా అసలు సిసలైన హైదరాబాదీ కావడం తెలంగాణకు గర్వకారణం. అంతర్జాతీయ టెన్నిస్ లో ఐదవ ర్యాంక్ ఉన్న సానియా నెంబర్ వన్ కావాలి అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సానియాకు చెక్ అంద చేసిన కార్యక్రమంలో కేసీఆర్ తోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, పరిశ్రమల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే. ప్రదీప్ చంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement