‘సానిటేషన్ సిబ్బంది... సార్ల ఇండ్లలో’ అనే శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో వచ్చిన కథనం సంచలనం కలిగించింది.
ఇంటి పనుల నుంచి తప్పించిన ప్రజాప్రతినిధులు
మంత్రి ఈటల, ఎంపీ వినోద్‌కుమార్ ఆరా
కరీంనగర్ : ‘సానిటేషన్ సిబ్బంది... సార్ల ఇండ్లలో’ అనే శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో వచ్చిన కథనం సంచలనం కలిగించింది. నగర పాలక సంస్థలో పారిశుధ్య పనులు నిర్వహించాల్సిన కార్మికుల చేత ప్రజాప్రతిని ధులు, అధికారుల ఇండ్లల్లో పనులు చేయించుకోవడం పెద్ద చర్చనీయాంశమైంది. ఇదే అంశంపై మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్ ఆరా తీ శారు. సానిటేషన్ సిబ్బంది మొత్తం ఎం తమంది ఇండ్లల్లో పనిచేస్తునారంటూ మేయర్, కమిషనర్‌లను ఆడిగినట్లు తెలి సింది. సానిటేషన్ సిబ్బంది నిబంధనల కు విరుద్ధంగా ప్రజాప్రతినిధులు, అధికారుల నివాసాల్లో పని చేయడానికి వీల్లేదని, వెంటనే వారిని పంపించి వేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఒకవేళ తన ఇంట్లో ఎవరైనా పారిశుధ్య కార్మికులుంటే వెంటనే పంపించాలని మంత్రి ఈటల సంబంధిత బాధ్యులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. సాక్షిలో వచ్చిన కథనాన్ని చూసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తన ఇంట్లో పనిచేస్తున్న ఇద్దరు సాని టేషన్ సిబ్బందిని పంపించి వేశారు. సం ప్రదాయం ప్రకారం ఎమ్మెల్యే నివాసంలో పని చేస్తున్నారని భావించామే తప్ప వాళ్ల తో పని చేయించుకోవాలనే ఉద్దేశమే తన కు లేదని స్పష్టం చేశారు. మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, కమిషనర్ కృష్ణభాస్కర్ సైతం తమ ఇండ్లలో పనిచేస్తున్న సిబ్బందిని పంపించి వేయాలని నిర్ణయించారు. అయితే ప్రభుత్వ పరంగా సిబ్బందిని నియమించుకునే అవకాశమున్నందున తనకు, కమిషనర్‌కు ఆ సౌకర్యం కల్పిం చాలని కోరుతూ లేఖ రాస్తున్నట్లు మేయ ర్ తెలిపారు. కలెక్టర్ నీతూప్రసాద్ సైతం తనకు తెలియకుండా క్యాంపు కార్యాల యంలో పనిచేస్తున్న సానిటేషన్ సిబ్బంది ని పంపించి ప్రభుత్వ పరంగా సిబ్బందిని నియమించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, కార్పొరేటర్ హరిశంకర్ తమ ఇంట్లో పని చేస్తున్న సానిటేషన్ సిబ్బందిని పంపించి వేశారు. రంజాన్ పండుగ సందర్భంగా ఇఫ్తార్ కార్యక్రమం ఏర్పాట్ల కోసమే పిలిచామే తప్ప సానిటేషన్ సిబ్బందితో తమకేమీ పని లేదని హరిశంకర్ వివరణ ఇచ్చారు. ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, సంతోష్‌కుమార్ సైతం ఆయా సిబ్బందిని పంపించి వేయాలని నిర్ణయించారు.
ఎంపీ ఇంట్లో సానిటేషన్ సిబ్బంది లేరు..
ఎంపీ వినోద్‌కుమార్ నివాసంలో సానిటేషన్ సిబ్బంది ఎవరూ పనిచేయడం లేదని ఆయన కార్యాలయ బాధ్యులు వివరణ ఇచ్చారు. ఎంపీ తన సొంత ఖర్చులతోనే సిబ్బందిని నియమించుకున్నారని పేర్కొన్నారు.